వీటిని తింటే మెదడు వ్యాధి ఖాయం?

Purushottham Vinay

మన మెదడును మనం కచ్చితంగా చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే మనం రోజూ తినే కొన్ని రకాల ఆహారాల వల్ల మెదడు ఆరోగ్యం కచ్చితంగా మందగిస్తుందని తెలిసింది. వాటిని ప్రతిరోజూ తినడం వల్ల మెదడు ఉత్తేజంగా ఉండదు. దానివల్ల ఫలితంగా వృద్ధాప్యంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మనం ఈ వయస్సులో మెదడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే వృద్ధాప్యంలో మనకు కచ్చితంగా అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే తీవ్రమైన మతిమరుపు అని అంటారు. దీంతో మన జ్ఞాపకశక్తి పూర్తిగా సన్నగిల్లిపోతుంది. ఎంతలా అంటే తమ పేరునే తాము గుర్తు పెట్టుకోలేకపోతారు. కాబట్టి మనం ప్రతి రోజూ కచ్చితంగా తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల స్నాక్స్ మన మెదడు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఆ స్నాక్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే కేకులు, పీనట్ బటర్ వంటి ఆహారాలను అస్సలు తినకూడదు. ఇవన్నీ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మెదడును నిస్తేజ పరుస్తాయి. దీంతో మెదడు యాక్టివ్‌గా ఉండదు. 


ఫలితంగా చురుగ్గా పనిచేయలేకపోతారు. తెలివితేటల్లో, యాక్టివిటీలో అందరికన్నా వెనుకబడతారు. బాగా వేయించిన పదార్థాలను కూడా తినకూడదు. వీటిల్లోనూ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే చక్కెర ఉండే పానీయాలను తాగకూడదు. మద్యం విపరీతంగా సేవించినా కూడా మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. దీంతో పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మద్యం వల్ల మెదడు మొద్దు బారిపోతుంది. దీర్ఘకాలికంగా మద్యం సేవించే వారి మానసిక శక్తి కూడా తగ్గిపోతుంది. వారు మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మద్యం సేవించడం కూడా మెదడుకు మంచిది కాదు.ఆలు చిప్స్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఈ చిప్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటినే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఇవి మనకు ఏమాత్రం మంచివి కావు. ఇవి మన శరీరంలో వాపులను కలగజేస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరు మందగించేలా చేస్తాయి. కాబట్టి చిప్స్‌ను అసలు తినకూడదు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను కూడా తినకూడదు. వీటిల్లో ఉండే చక్కెర మెదడు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: