లవంగాలతో షుగర్ కంట్రోల్ చేస్కోండి ఇలా!

frame లవంగాలతో షుగర్ కంట్రోల్ చేస్కోండి ఇలా!

Purushottham Vinay

డయాబెటిస్ అనేది ఒకసారి సోకితే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన మెడిసిన్. కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ..బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ కావు.అలాంటి వారు మీ రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లవంగాలు డయాబెటిస్ నిరంత్రణకు ఎలా ఉపయోగపడతాయి. వాటిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలు..మసాలాల్లో రారాజుగా పిలుస్తుంటారు. వీటిలో అనేక  ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అని  ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరీ అత్యంత ముఖ్యంగా లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం..రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. దీంతోపాటు లవంగాలను  రోజు ఆహారంలో భాగం చేసుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు.లవంగాలను ఆహారంలో ఏ విధంగా తీసుకోవాలో  చూద్దాం?


రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవాలి. అందులో 6 లేదా 8 లవంగాలు వేసి స్టౌ పై పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లను వడకట్టుకోవాలి. కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రెండు లేదా మూడు నెలల పాటు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లేదంటే ప్రతిరోజు రెండు నుంచి మూడు లవంగాలు నమిలినా మంచి ఫలితం  ఉంటుందంటున్నారు. ఇవి తీసుకోవడంతో పాటు మీరు  రోజు తీసుకునే ఆహారం కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని ఆరోగ్యయ నిపుణులు చెబుతున్నారు . ఈ విషయాన్ని 2018లో జర్నల్ ఆఫ్ డయాబెటిస్, లైఫ్ స్టైల్ అండ్ క్లీనికల్ రీసెర్చీలో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం..టైప్ 2 డయాబెటిస్ ఉన్నవ్యక్తులు 4 వారాలు పాటు రోజుకు 3 లవంగాలు తింటే వారి రక్తంలో షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయని, షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీకి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎ రాజ్ మోహన్ రావు గారు పాల్గొన్నారు. లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: