ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఇలా చెయ్యండి?

Purushottham Vinay

ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఇలా చెయ్యండి?

శరీరాన్ని ఉత్తేజంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉంచడానికి నిద్ర చాలా అవసరం. ఒక్క రాత్రి సరిగ్గా నిద్రలేకపోయినా మరుసటి రోజుకి బాగా అలిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ పని చేయాలన్నా సత్తువ లేనట్టుగా, నీరసంగా ఉంటుంది.శరీరం వాలిపోతున్నట్టుగా, నిస్సత్తువగా ఉండటం అనేది కామన్ గా కనిపించే లక్షణాలు. అయితే రాత్రి పూట  సరిగ్గా నిద్ర ఉండకపోవడం అనేది కొద్దిమందిలో మాత్రమే కనిపించే లక్షణం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. సరైన జీవన శైలి అలవాట్లు లేకపోవడం ప్రధాన కారణం, ఇంకా అనారోగ్యయం వల్ల కూడా రాత్రి సమయంలో నిద్ర అనేది ఉండకపోవచ్చు.. అసలు దీనికి గల కారణాలు ఏమిటనేది చూద్దాం.


నిద్రపోవడానికి కష్టపడటం నిరాశ కలిగిస్తుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి పూట నిద్ర సక్రమంగా ఉండాలంటే..స్థిరమైన నిద్ర షెడ్యూల్వేయండి.. వారం అంతలో కూడా సరైన సమయానికి పడుకుని, సరైన సమయానికి నిద్ర లేచే అలవాటు చేసుకోవాలి. దీనితో సమయం కాగానే నిద్రపోవడం, మేల్కోవడం అనేది సులభం అవుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటున్నామా.. సరైన సమాయనికే నిద్రపోతున్నామా అనేది గమించుకోవాలి. ప్రతి రాత్రి 7 నుంచి 9 గంటల సమయం నిద్రపోవాలి. రిలాక్సింగ్ బెట్ టైమ్..నిద్రపోయే ముందు ప్రశాంతమైన పనులు మాత్రమే చేయాలి. శరీరానికి విశ్రాంతిని ఇచ్చేలా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, యోగా ఇలాంటి వంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం, వంటివి చేయకూడదు. బ్లూలైట్ వద్దు..ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల కారణంగా వచ్చే బ్లూ లైట్ శరీరం మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది నిద్రను నియంత్రంచే హార్మోన్. నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు వీటికి దూరంగా ఉండాలి.అప్పుడే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: