కలకాలం గుండె పదిలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే?

Purushottham Vinay

కలకాలం గుండె పదిలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోస కాయలు బాగా ఉపయోగపడతాయి. దోసకాయలు హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇవి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో కూడి ఉంటాయి. హృదయ ఆరోగ్యాన్ని పెంచడంలో అద్భుతంగా సాయపడతాయి.బొప్పాయిలో విటమిన్ సి, లైకోపీన్ బెస్ట్ సోర్స్ అని చెప్పవచ్చు. బొప్పాయి తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంచడంలో సాయపడుతుంది.పుచ్చకాయలోని అనేక పోషకాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, బి6, విటమిన్ సి వంటి పోషకాలు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడతాయి.వేసవి సీజన్‌లో అత్యంత ఇష్టపడే పండు మామిడి.. ఈ పండుతో పదిలంగా గుండె ఆరోగ్యాన్ని పొందవచ్చు. అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది.

మామిడిలో మెగ్నీషియం, పొటాషియం ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు సాయపడుతుంది. లో-బీపీ సమస్యను తగ్గించగలదు. మామిడిపండ్లు తినడం ద్వారా మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సాయపడతాయి.బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడతాయి. రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్‌లో ముఖ్యంగా కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది. లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరుస్తుంది. మొత్తం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిలోని అనేక ముఖ్యమైన పోషకాలు గుండె సరిగా పనిచేయడంలో సాయపడతాయి. గుండె జబ్బుల మొత్తం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సాయపడతాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం మీ ఆహారంలో తప్పనిసరిగా ఇవి యాడ్ చేసుకోవాలి. కలకాలం గుండె పదిలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..
అప్పుడే మీ గుండె కలకాలం ఎంతో ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: