బాలికకు కుడివైపు గుండె.. దీంతో వైద్యులు ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో వైద్య రంగంలో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  చనిపోయిన మనిషిని బ్రతికించడం తప్ప మిగతావన్నీ కూడా సుసాధ్యం చేస్తున్నాడు మనిషి. అందుకే నేటి రోజుల్లో వైద్యుడిని ఏకంగా దేవుడితో పోల్చి చూస్తూ ఉన్నారు అందరూ. సాధారణంగా అయితే వైద్యుల వద్దకు ఎప్పుడు ఎన్నో రకాల సమస్యలతో బాధపడే పేషెంట్లు వస్తూ ఉంటారు. అందుకే ఎలాంటి వ్యాధితో పేషెంట్ తమ దగ్గరికి వచ్చిన వైద్యులకు పెద్దగా కొత్తగా ఏం అనిపించదు.

 కానీ ఏకంగా అనుభవజ్ఞులైన వైద్యులను సైతం అవాక్కయ్యేలా చేసే కొన్ని విచిత్రమైన కేసులు అప్పుడప్పుడు హాస్పిటల్ కు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎడమవైపు గుండె ఉంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరికైనా కుడివైపు గుండె ఉంటుందా అంటే అలా ఎందుకు ఉంటుంది అంటారు ఎవరైనా. అయితే ప్రపంచంలో చాలా అరుదుగా కొంతమందికి కుడి వైపుకు కూడా గుండె ఉంటుందట. ఇక సాధారణ మనిషితో పోల్చి చూస్తే శరీరంలోని అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉంటాయట.

 అయితే అచ్చం ఇలాంటి వ్యాధితోనే బాధపడుతున్న ఒక యువతి ఇటీవలే వైద్యుల వద్దకు వెళ్ళగా.. ఆమె సమస్య గురించి తెలిసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. అందరిలా కాకుండా ఏకంగా ఆమెకు కుడివైపు గుండె ఉంది. దీంతో యువతి కొంతకాలం నుంచి ఇబ్బందులు పడుతుంది. అయితే తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. ఆ యువతి పరిస్థితి తల్లిదండ్రులకు వివరించారు వైద్యులు. ఈ క్రమంలోనే గుంటూరు వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి విజయం సాధించారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగం గుంట్లకు చెందిన మేరీ, ఓంకారయ్య దంపతులకు ఎస్తేరు రాణి అనే కూతురు ఉంది. అయితే యువతకి 16 ఏళ్ళ వయసు. గత కొన్ని రోజులుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుంది. ఆసుపత్రిలో చేర్పిస్తే పరీక్షలు చేసిన వైద్యులు  గుండె కుడి వైపు ఉంది అని  గుర్తించారు.  ఎండోస్కోపీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి బాలిక సమస్యను పరిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: