బెండకాయలు తింటే ఈ రోగాలన్నీ పరార్..!!

Divya
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా కూరగాయలు పండ్లు తింటూనే ఉండాలి.. వీటివల్ల మన శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి.. బెండకాయ మొక్క మాల్వేసి కుటుంబానికి చెందిన మొక్క కావడంతో దీనిని ఫ్రై లేదా సాంబార్.. పుల్లగూర వంటివి చేసుకోవచ్చు. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉండడం వల్ల క్యాన్సర్ గుండె జబ్బులను కూడా రాకుండా చేస్తాయట. ఆయుర్వేద ప్రకారం బెండకాయ జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుందని దీనివల్ల వేడి కూడా తగ్గుతుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.
బెండకాయలలో ఉండే విటమిన్స్ విషయానికి వస్తే..A,C,K తో పాటు క్యాల్షియం, పొటాషియం ,ఐరన్ వంటిది పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలు అతి తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల ఎక్కువ గా తినవచ్చు.

బెండకాయలలో ఉండే పీచు పదార్థాలు డయాబెటిస్ రోగులను రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల వీరికి ఎక్కువగా ఆకలి అనేది వేయకుండా చేస్తాయి.

బెండకాయలలో ఉండేటువంటి పీచు పదార్థం వల్ల చెడు కొలెస్ట్రాలను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మలబద్ధక సమస్యను కూడా నివారించడానికి బెండకాయలు ఉపయోగపడతాయి.

బెండకాయలలో ఉండేటువంటి విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.

బెండకాయలలో ఉండే ఫోలేట్ వల్ల గర్భిణీ స్త్రీలు వీటిని తినడం చాలా మంచిది.
బెండకాయలలో విటమిన్ K ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాది.

బెండకాయలలో ఉండేటువంటి బీటా కెరీటం కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుందట.
బెండకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి కణాలను సైతం పెరగకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
బెండకాయలలో గుండె విటమిన్-C వల్ల చర్మం జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేలా చేస్తుంది.

లేత బెండకాయలు తినడం వల్ల ఎక్కువగా అందులో పోషకాలు ఉంటాయి.. బెండకాయలను ఎన్ని విధాలుగా అయినా సరే మనం తినవచ్చు. అయితే ఎక్కువ సేపు ఉడికించి తినడం వల్ల అందులో పోషకాలు నశిస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: