మహిళల్లో తరచూ వచ్చే ఈ ఇన్ఫెక్షన్ లను ఎలా నివారించాలంటే..?

Divya
నిత్యజీవితంలో చాలా రకాల ఇన్ఫెక్షన్లను మనం చూస్తూనే ఉంటాం అయితే చాలా మంది రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు.. మరీ ముఖ్యంగా మహిళల్లో వచ్చే ప్రధానమైన ఇన్ఫెక్షన్ లలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి.. ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించింది ముఖ్యంగా ఈ రకమైన ఇన్ఫెక్షన్ కాండిడా అనే ఫంగస్ వల్ల వస్తుంది.. అది శరీరంలో ప్రవేశించినప్పుడు యోని ద్వారం గుండా ఉండే మూత్రనాళాల ద్వారాలకు వాపు,  మూత్రంలో మంట, విపరీతమైన దురదకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు పాఠశాలల్లో,  కళాశాలలో చదువుతున్న ఆడపిల్లలు అలాగే బయట పని చేసే మహిళల్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. దేశంలో ఏడాదికి 75% మంది మహిళలు దీని బారిన పడుతున్నట్లు నిపుణులు తెలిపారు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్  నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి దాదాపు 4.7 లక్షల కేసులు నమోదవుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. మరి అలాంటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
ముఖ్యంగా బయట విరివిగా లభ్యమయ్యే ఆంటీ బయోటిక్స్ వాడకుండా ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే సమస్యకు పెట్టవచ్చు.. హోమ్ రెమెడీస్ ఏమిటంటే ఎక్కువగా మంచినీరు తాగాలి.. అలాగే లో దుస్తులు మంచి ఫ్యాబ్రిక్ తో చేసినవి.. ప్యూర్ కాటన్ ఉపయోగించడం తప్పనిసరి.. కొబ్బరి బోండాలు చెరుకు రసం వంటివి కూడా తీసుకోవాలి.. వేపాకును మరిగించి ఆ నీటితో యోని భాగం శుభ్రం చేసుకోవడం , స్నానం చేయడం లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్స్ త్వరగా పోతాయి.. అలాగే చిన్న పెద్ద రోగాలకు తెలిసి తెలియకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదు. పెరుగు, మజ్జిగను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు..
ఇకపోతే ఈ సమస్య వచ్చిందని ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే.. ఒత్తిడి ఎక్కువగా ఉండడం ప్రశాంతత లేకపోవడం మూత్రంలో మంట ఋతుక్రమంలో వివిధ రకాల రంగులలో వైట్ డిస్చార్జ్ కావడం వంటి వాటిని బట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిందని గుర్తించాలి.. ఇక తర్వాత పలు జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: