రాగి సంగటి తినడం వల్ల.. ఇంత మంచి చేస్తుందా..!!

Divya
మన చుట్టూ పండేటువంటి వాటిలలో రాగులు కూడా ఒకటి.. అయితే రాగులు మన శరీరానికి అవసరమైన పోషకాలను సైతం అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటువంటి ఖనిజాలు, విటమిన్స్ వంటివి మన శరీరానికి చాలా అవసరము.. రాగి రొట్టి, రాగి సంగటి వల్లే మనం శక్తివంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చాలా మందికి రాగి రొట్టె తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిసి ఉండవు ఒకవేళ తెలిస్తే వీటిని కచ్చితంగా తింటారు.

రాగులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల బరువు కూడా కంట్రోల్ చేస్తూ తగ్గడానికి సహాయపడుతుంది.

రాగులలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు బలంగా ఉంచేలా సహాయపడుతాయి.. రాగి రొట్టెని, రాగి ముద్దని  క్రమం తప్పకుండా తినడం వల్ల మీ ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బోలు ఎముక వ్యాధి నుంచి కూడా బయటపడేలా చేస్తుంది.
రాగులలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్లు ఇవి నిరంతరం శక్తిని సైతం అందిస్తాయి..

రాగులలో కరగని ఫైబర్, పాలి ఫెనాల్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా ఉండడం వల్ల ఇవి ఎల్డి ఎల్  కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందట.
రాగులల ఫైబర్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మంచిగా ఉండేలా చూస్తోంది. మలబద్ధక సమస్యను కూడా నివారించి పెద్దప్రేగు కదలికను కూడా జరిగేలా చేస్తుంది.

హైబీపీతో రక్తహీనతతో ఎముకల వీక్నెస్తో ఇబ్బంది పడేవారు రాగి జ్యూస్ తాగడం లేదా రాగి ముద్ద తినడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.. వీటితోపాటు అజీర్తి సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

అందుకని మన పూర్వీకులు కూడా ఎక్కువగా రాగి సంగటిని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉండేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: