రక్తప్రసరణ బాగా మెరుగవ్వాలంటే..?

Purushottham Vinay
మంచి ఆరోగ్యకరమైన ఆహారం మన డైట్లో చేర్చుకుంటే రక్తప్రసరణ మెరుగవ్వడమే కాదు. ఏ ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇవి పాటిస్తూ కొన్ని ఆరోగ్యకరమైన ఎక్సర్‌సైజులు చేస్తే సరిపోతుంది.కీవీల్లో కూడా విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. ఇది రక్తనాళాలకు ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. వాటిని మరింత ఆరోగ్యవంతం చేయడానికి తోడ్పడతాయి.దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు రక్తప్రసరణను పెంచే పాలిఫెనల్స్ ఉంటాయి.ఇది బ్లడ్ సర్క్యూలేషన్‌ను పెంచుతాయి. బ్లడ్ ప్రెజర్ సమస్యను కూడా దానిమ్మ తగ్గిస్తుంది. దానిమ్మ కూడా మన శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది.పుచ్చకాయలో కూడా అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, దీన్ని సిట్రల్లైన్ అంటారు. ఇది శరీరంలో ఆర్జినైన్ గా మారుతుంది. ఆర్జినైన్ మన శరీరంలో నైట్రిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్త సరఫరా మార్గాన్ని విస్తరింపజేసి రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది.


పుచ్చకాయలో ఉండే లైకోపీన్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.విటమిన్ సీ ఉండే పండ్లు కూడా రక్తనాళాలను బలపరిచేలా సహాయం చేస్తాయి. అంతేకాదు ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా ప్రేరేపిస్తాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తసరఫరాను మెరుగుపరుస్తాయి. ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గిస్తుంది.బ్లూబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆంథోసియానైన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంటుంది. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు గుండె సంబంధిత సమస్యలను రాకుండా నివారిస్తాయి. బ్లూబెర్రీల్లో విటమిన్ సీ, ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ రెండు కూడా బ్లడ్‌ సర్క్యూలేషన్‌కు ఎంతో ముఖ్యం.ఈ పండ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచే లక్షణం ఉంటుంది. ఇవి రక్తనాళాలను రిలాక్స్ చేసి సాగేలా చేస్తుంది. ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కార్డియోవాస్క్య్యూలర్ సిస్టంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో బ్లడ్‌ ప్రెజర్ కూడా సాధారణంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: