ఉదయాన్నే ఇవి తింటే చాలా హుషారుగా ఉంటారు?

Purushottham Vinay
ఉదయాన్నే గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి బరువు తగ్గేందుకు ఇదొక మంచి ఆప్షన్‌. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. గుడ్లు సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి.బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును సలాడ్‌ రూపంలోనూ, పచ్చిగా కూడా తినవచ్చు. లేదంటే ప్రోటీన్ షేక్స్‌లో తిన్నా మంచిది. మీరు కాఫీకి  బాదం పాలను కూడా తాగవచ్చు. విటమిన్ E, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్, మాంగనీస్, ఫైబర్‌తో నిండిన బాదం మీకు బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత తినటం మంచిది.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే ఎన్నో లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే విటమిన్ సి ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఖాళీ కడుపుతో ఆపిల్‌ తింటే చాలా మేలని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది. అంతేకాదు, ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.


శరీరంలో వాపులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరం రోజంతా యాక్టివ్‌గానూ ఉంటుంది.ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఖనిజాలు, విటమిన్లు A, B1, B2, C సమృద్ధిగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఎ, బి,సి, ఇ, కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, ఫైబర్‌, ప్రోటీన్ వంటి పోషకాలు ఆపిల్స్‌లో పుష్కలంగా లభిస్తాయి.సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల శక్తి లభిస్తుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. అదనంగా, అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మనల్ని రిలాక్స్‌గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి అల్పాహారానికి ముందు అరటిపండు తింటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: