పొట్ట సమస్యలకి చిటికెలో చెక్ పెట్టే చిట్కాలు?

Purushottham Vinay
జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కలబంద కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కలబంద గుజ్జును ప్రతిరోజు రెండు టీ స్పూన్ల పాటు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి.ఇంగువ కూడా జీర్ణ సమస్యలు కలిగించకుండా జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాస్ నీటిలో చిటికెడు ఇంగువను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలు పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇంగువను ఆహారంలో వినియోగించడం ఎంతో మంచిది.పుదీనాలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి.అందువల్ల కడుపునొప్పి, కడుపులో గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పుదీనాతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల గొప్ప ఉపశమనాన్ని పొందుతారు.


అంతేకాకుండా పుదీనా ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు పొట్టను చల్లగా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా తరచుగా పుట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుదీనా రసాన్ని తాగాల్సి ఉంటుంది.జీలకర్ర కూడా పొట్టలోని గ్యాస్ తగ్గించడానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజు జీలకర్రను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక టీస్పూన్ జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి, వడగట్టి తాగండి.గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు అల్లంని వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక టీస్పూన్ అల్లం ముక్కలు వేసి మరిగించి, వడగట్టి తాగండి. గ్యాస్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా ప్రతిరోజు ఉదయం పూట తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: