ఒక్క బ్రెడ్ ప్రూట్ తో ఇన్ని ప్రయోనాలా..!

Divya
సాధారణంగా పండ్లను తీసుకోవడం వల్ల,మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అలాంటి కోవలోకి వస్తుంది బ్రెడ్ ఫ్రూట్.ఇది మన దేశంలో అంతగా పండక పోవచ్చు.కానీ ఇది మల్బరీ మరియు జాక్ ప్రూట్ రకానికి చెందిన పండు.మరియు ఇది తినడానికి కూడా తియ్య తియ్యగా,పుల్లపుల్లగా చాలా రుచికి భలేగా ఉంటుంది.ఒక్కసారి ఈ పండు తినడం అలవాటు చేసుకున్నారంటే అస్సలు వదలలేరు.ఈ పండు తినడం వల్ల,రుచి ఎంత ఇష్టంగా ఉంటుందో,అంతకంటే ఎక్కువే ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు ఆహార నిపుణులు.అసలు ఒక్క బ్రెడ్ ఫ్రూట్ తిన్నామంటే..ఏ ఇతర ఆహారం అవసరం లేదని కూడా చెబుతున్నారు.అలాంటి బ్రెడ్ ఫుట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..
బ్రెడ్ ఫ్రూట్‌ ఒక పోషకాల గని అని చెప్పవచ్చు.ఇందులో అవసరమైన విటమిన్లు,ఖనిజాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కళంగా లభిస్తాయి.ఇది విటమిన్ సి పుట్టినిల్లు అని చెప్పవచ్చు.దీనిని తరుచూ తీసుకోవడంతో,రోగనిరోధక శక్తి పెరుగుతుంది.మరియు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. అంతేకాక ఇందులో విటమిన్ ఎ,పొటాషియం, మెగ్నీషియం,ఫైబర్ అధికంగా లభించి,మొత్తం ఆరోగ్య శ్రేయస్సుకు దోహదం చేస్తుంది.
పెరుగులో ఉన్న ప్రోబయాటిక్స్ ఈ పండులో కూడా లభిస్తాయి.దీనిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి,గ్యాస్,మలబద్ధకం,అజీర్తి వంటి సమస్యలు తొలగుతాయి.
ఈ ఫ్రూట్‌లో  పొటాషియం కంటెంట్ అధికంగా లభించడంతో గుండె ఆరోగ్యానికి మంచి సపోర్ట్‌గా పనిచేస్తుంది.ఇది అధిక బిపిని నియంత్రించడంలోను,వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.మరియు నరాల  బలహీనతను తగ్గిస్తుంది.
ఈ ఫ్రూట్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల,కొంచెం తిన్నా సరే ఎక్కువ తిన్న ఫీలింగ్ వచ్చి,ఇతర ఆహారాలపై మనసు వెళ్లకుండా చేస్తుంది.దీనితో అధికంగా తినాలనే కోరిక తగ్గడంతో,బరువును అదుపులో ఉంచుకోవచ్చు.మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది.
 మరియు ఇందులో విటమిన్ ఏ అధికంగా లభించడంతో కంటి చూపు మరియు జుట్టు పెరుగుదలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కావున ఇన్ని పోషకాలు కలిగిన ఈ ఫ్రూట్ ను మార్కెట్లో దొరికినప్పుడు మాత్రం అస్సలు వదలకుండా ఇంటికి తెచ్చుకొని చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: