ఈ ఆకుని తిన్నారంటే షుగర్, క్యాన్సర్ మాయం?

Purushottham Vinay
బిర్యానీ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకులో ఉండే రుటిన్‌, కెఫిన్‌ ఆమ్లం తదితరాల వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్‌ టెన్షన్‌ లాంటివి రాకుండా ఉంటాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. క్యాన్సర్‌ కణాలను నివారించడంలో ఈ ఆకులు సహాయపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.బిర్యానీ ఆకు వినియోగంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌ లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.


పొట్ట ఆరోగ్యం బాగుపడి జీవ క్రియ మెరుగవుతుంది.ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు.ఈ వ్యాధిలో బాధితుల రక్తంలో చక్కెర స్థాయి అనియంత్రితంగా పెరగడం ప్రారంభమవుతుంది.అందుకే మధుమేహాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం.మధుమేహం అదుపులో ఉండాలంటే పలావు ఆకుల రసాన్ని సేవించవచ్చు. దీని కోసం ఒక పాన్లో ఒక గ్లాసు నీటిని వేడి చేయండి. ఈ నీటిలో 2-3 పలావ్ ఆకులను వేసి సుమారు 5 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడపోసి గోరువెచ్చగా తాగాలి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.పలావ్ ఆకులను తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే పాలీఫెనాల్స్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాదు శరీరంలోని ఇన్సులిన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దీని రెగ్యులర్ వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: