అతిగా చపాతీలు తినడం వల్ల కలిగే ఆనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?
కానీ ఇది అస్సలు మంచిది కాదని,దీనివల్ల చాలా అనారోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.దీనిపై చాలా పరిశోధనలకు కూడా జరిగాయని హెచ్చరిస్తూ ఉన్నారు.అసలు రోజు చపాతి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
సాధారణంగా చపాతీలను గోధుమపిండి,మైదా పిండితో తయారు చేస్తూ ఉంటారు ఒక్కొక్క చపాతీలో 120 క్యాలరీలు ఉంటాయి.ఒక వేళ చపాతి తినాల్సి వస్తే స్త్రీలు రెండు కంటే మించి తినకూడదు.మరియు పురుషులు మూడు కంటే ఎక్కువ అస్సలు తినకూడదు.
ప్రతిరోజు చపాతీలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ మరియు గ్లూటెన్ అధికంగా లభిస్తుంది కనుక.ఈ గ్లూటెన్ కలిగిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల,మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి క్రమంగా మధుమేహానికి దారితీస్తుంది.
అంతేకాక మన జీర్ణ వ్యవస్థలో రిలీజ్ అయ్యి జీనరసాలపై ప్రభావం పడి గ్యాస్, గుండెల్లో మంట,అజీర్తి వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంకా కొంతమందిలో అయితే ఇందులో ఉన్న అధిక ఫైబర్ వల్ల విరోచనాలు,అతిసారా కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
మధుమేహం,పిసిఒడి,థైరాయిడ్ తో బాధపడుతున్న రోగులకు రాత్రిపూట చపాతీ తినడం పెద్ద సమస్యగా మారుతుంది.రోటీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసి,వారి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
మీరు కూడా చపాతి బదులుగా చిరుధాన్యాలతో తయారు చేసిన రోటీలు తినడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.