ఈ మసాలా దినుసుతో సంపూర్ణ ఆరోగ్యం ఖాయం?

Purushottham Vinay
జీలకర్ర ఒకమాంచి ఆంటిబయోటిక్ అని మీలో ఎంతమందికి తెలుసు?అసలు జీలకర్ర అంటే ఏంటో తెలుసా? చాలామందికి దీని పేరు సరిగా తెలీదు,ఒకవేళ పేరు తెలిసిన అది ఎలా ఉంటుందో తెలీదు,అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.జీలకర్ర వంటగదిలో ఉంటే ఓక మంచి సువాసన గల మసాలా దినుసు.దీన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు.పోపు దినుసుల్లో ఇది కూడా ఒకటి.కొన్నిచోట్ల జీరారైస్ కూడా చేస్తుంటారు.రుచి అద్భుతంగా ఉంటుంది.అయితే కొంతమంది నిపుణులు ఈ జీరా వంటింటికే పరిమితం కాదు అంటున్నారు.దీనిలో ఎన్నో ఔషద గుణాలున్నాయి అని చెప్తున్నారు.మరి అవేంటో చూద్దాం.

జీరా వాటర్ లో మరిగించి ఆ వాటర్ ఉదయాన్నే తాగడం వల్ల చాలా మంచి మేలు జరుగుతుంది.ఇలా డైలీ జీరా వాటర్ తాగడం వల్ల ఎప్పటినుండో తుప్పులా పట్టిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.బీపీ లెవెల్స్ కాట్రోల్లో ఉంచుతుంది.స్కిన్ కి సంబందించిన దురదలు తామరవంటి వాటికి ఈ జీలకర్రతో చెక్ పెట్టవచ్చు.అంతే ఫేస్ మీద ఉన్న మంగుమచ్చలు మొటిమల మచ్చలని కూడా ఇది తగ్గిస్తుంది.బరువు తగ్గాలనుకునే వారికి,షుగర్ వ్యాధి బారిన పడిన వారికి ఇది ఒక మెడిసిన్ లాంటిది.ఆహారాన్ని సరైన క్రమంలో జీర్ణం అయ్యేలా సహాయపడుతుంది.రక్తంలో చెడు క్రొవ్వుని వేరు చేసి దాన్ని బైటకి తరిమికొట్టి రక్తాని శుద్ది చేస్తుంది.మహిళలలో ఈ జీలకర్ర రోజు తీసుకుంటే రుతుక్రమ సమస్యలు తగ్గి నెలసరి క్రమంగా వస్తుంది.నెలసరి సరైన కాలంలో వస్తే PCOD,PCOS,థైరాయిడ్ సమస్యలు దరి చేరవు.శరీరంలో వేడిని తగ్గించి చల్లభరుస్తుంది.ఇంకా మనకి తెలియని ఎన్నో మంచి గుణాలు సుగుణాలు దీనిలో ఉన్నాయని పెద్దలుచెప్తున్నారు. పచ్చడ్లలో,కూరళ్ళలో,పప్పులో తినే ఆహార పదార్దాలలో మాత్రమే కాకుండా, ఇలా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.ఇవే కాదు మనచుట్టూ ఉండే వాటిలో మనకు తెలియకుండానే ఎన్నో ఔషద గుణాలు కలిగి ఉంటాయి, వంటగదిలో, మనం పెంచే మొక్కల్లో మనకి తెలియని మంచి చాలా ఉంది,అవి ఏంటో మనం తెలుసుకొని ఉపయోగించుకుంటే, హాస్పటల్స్ చుట్టూ తిరగనవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: