తమలపాకుల వల్ల కలిగే ఉపయోగాలు?

frame తమలపాకుల వల్ల కలిగే ఉపయోగాలు?

Purushottham Vinay
తమలపాకుకి ఒక ప్రతేకమైన గుర్తింపు వుంది.మన హిందూ సంప్రదాయం లో తమలపాకుకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అసలు తమలపాకు లేని శుభాకార్యం అంటూ ఉండదు. ఈ తమలపాకు శుభకార్యానికి మంచి సూచనగా పెద్దలు భావిస్తారు. అయితే అదే తమలపాకు చెట్టు మన ఇంటి ముందు ఉంటే ఎంతో   మంచిది అంటున్నారు కొంతమంది ఆయుర్వేద నిపుణులు. ఉదయం నిద్రలేవగానే ఈ చెట్టుని చూస్తే ఆ రోజంతా సంతోషం గా ఉంటుందని సకల సౌభాగ్యాలతో ఎల్లపుడు సంతోషంగా ఉంటారని చెప్తున్నారు. ఈ ఆకు గురించి తెలిసిన వాళ్ళు ఇంటి ముందు పలురకాల మొక్కలతో పాటు తమలపాకు మొక్కని కూడా పెంచుతున్నారు. అయితే ఈ ఆకు వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


తమలపాకు తినటం వలన నోరు సమస్యలు తొలగిపోతాయి. నోరు దుర్వాసన, పంటి నొప్పి, చిగురులో వాపు, చీము , రక్తం కారటం లాంటి సమస్యలు తొలగించే గొప్ప ఔషద గుణాలు ఈ ఆకులో పుష్కళంగా ఉన్నాయి.రోజు తమలపాకు తినడం వల్ల మౌత్ ప్రెష్ గా సువాసనతో ఉంటుంది.
భోజనం తర్వాత ఈ ఆకు నమలడం వల్ల జీర్ణక్రియ చక్కగా కొనసాగుతుంది. అందుకే భోజనం తర్వాత ఈ తమలపాకుతో పలు రకాలు కిల్లీలు తయారుచేసి ఇస్తూ ఉంటారు.ఈ ఆకు రక్తంలో చక్కరను అదుపుచేయడంలో సహాయపడుతుంది.అంతే కాదు చర్మ సమస్యలకి గాయాలకి మంచి యాంటిబాయోటిక్ లా పని చేస్తుంది.


రక్తంలో వేస్ట్ మలినాలని బయటకి తరిమికొట్టి కొవ్వుని కరిగిస్తుంది.ఆయాసం, దగ్గు, తుమ్ములు, తలపోటు, వంటి వాటికి ఈ ఆకు మంచి చిట్కాలా పని చేస్తుంది.అంతే కాదు ఈ ఆకులో అందాన్ని పెంచే గుణాలు కూడా ఎక్కువే ఉన్నాయి.ఈ ఆకుని పేస్ట్ ల చేసి ఫేస్కి మాస్క్ లా వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.ఈ మిశ్రమాన్ని రోజు రాడుకోవడం వల్ల ఫేస్ పై మచ్చలు మొటిమలు ఇట్టే మాయమై పోతాయి.ఈ తమలపాకులో ఎన్నో మంచి ఔషద గుణాలు ఉన్నాయి.మీరు పెంచే మొక్కలతో పాటు ఈ తమలపాకు మొక్కని కూడా పెంచడం మర్చిపోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: