డయాబెటిస్ ప్రస్తుతం అందరిని బాగా వణికిస్తున్న సమస్య. ఈ సమస్యను ప్రారంభంలోనే అదుపు చేసుకుంటే మేలు జరుగుతుందని ఆరోగ్యం నిపుణులు సైతం చెబుతున్నారు. అందుకే మనం ఖచ్చితంగా తీసుకునే ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మంచి ఆహారాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ చక్కెర స్థాయిలను నియంత్రించే ఆ ఫుడ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.హోల్ గ్రెయిన్ టోస్ట్‌లు షుగర్ పేషెంట్స్‌కి మంచి హెల్తీ ఫుడ్‌గా చెప్పొచ్చు. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటితో పాటు
అవకాడో కూడా బెస్ట్ ఆప్షన్. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి, ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడతాయి.ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.ఇంకా అలాగే ఓట్స్ కూడా షుగర్ నియంత్రనలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తాయి.
ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి గుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రొటీన్లనేవి ఎక్కువగా గుడ్లు షుగర్ పేషంట్లకు మంచి టిఫిన్‌గా పనిచేస్తుంది.ఇక షుగర్ పేషెంట్స్‌కి బెర్రీస్ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పుష్కలంగా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా జరిగే కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే పెరుగులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్‌కి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడుతుంది.