మీ పిల్లలకు నత్తి ఉందా.. అయితే ఇలా తగ్గించవచ్చట?

praveen
సాధారణంగా పిల్లలకు పుట్టుకతోనే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వాటిలో నత్తి రావడం సమస్య కూడా ఒకటి. ఇక ఇటీవల కాలంలో చాలా మంది నత్తి అనే సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. అయితే నత్తి సమస్య వస్తే అందరిలాగా అనర్గళంగా మాట్లాడలేరు. ఏది మాట్లాడాలి అన్న ఇక సగంలో ఆగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని పదాలు పలకడానికి చాలా కష్టపడి పోతూ ఉంటారు.

 అయితే ఇటీవల కాలంలో ఉద్యోగం చేయాలన్న వ్యాపారం చేయాలన్న కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఇలా నత్తి తో బాధపడేవారు ఇక ఎంతలా టాలెంటెడ్ అయివున్నప్పటికీ నత్తి కారణంగా ఎక్కడ పదిమందిలో సరిగ్గా మాట్లాడలేరు. ఇక తరచూ కొన్ని కష్టమైన పదాలు పలకడానికి ఇబ్బంది పడుతూ నవ్వుల పాలు అవుతూ ఉంటారు. దీంతో మాకే ఇలాంటి నత్తి రోగం ఎందుకు వచ్చింది రా బాబు అని ఎన్నోసార్లు తమను తాము తిట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా నత్తి సమస్యకు చిన్నప్పుడే ముగింపు పలికేందుకు అవకాశం ఉంటుంది అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.

 ఇక ఈ విషయంపై బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సరికొత్త విషయాలను వెల్లడించింది. నత్తి ఉన్న పిల్లలు పలక లేక ఇబ్బంది పడే వ్యాఖ్యలను త్వరగా ముగించేందుకు ట్రై చేయించవద్దు అంటూ బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది. వారు మాట్లాడుతూ ఉంటే మధ్యలో కల్పించుకోవద్దట. ఇక త్వరగా నిదానంగా మాట్లాడమని సూచించవద్దట. ఇక తల్లిదండ్రులు కూడా వారితో చిన్న వ్యాఖ్యలు మాట్లాడితే బెటర్ అని చెబుతున్నారూ నిపుణులు. అంతేకాదు పిల్లలనుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్పీచ్ తెరఫీ తీసుకోవాలని సూచిస్తున్నారు.  ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది అని చెబుతున్నారు. అయితే ఏ వయస్సు వారైనా సరే స్పీచ్ తెరఫీ తీసుకుంటే ఉపయోగం ఉంటుందట. అంతే కాకుండా ఇక ప్రత్యేకమైన కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: