క్యాన్సర్ రాకుండా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి?
క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన రోగమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా తగ్గడం అంత సులభమైన విషయం కాదు. అయితే తీసుకునే ఆహారం విషయంలో మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి వాటికి దూరంగా ఉంటే క్యాన్సర్ దరిచేరదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అతిగా మద్యం తాగడం కూడా క్యాన్సర్‌కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రొమ్ము, అన్నవాహిక, ప్యాంక్రియాటిక్, కాలేయ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ మెటబాలిజం సమయంలో ఎసిటాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకం ఉత్పత్తి అవుతుంది.అలాగే వేయించిన కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం, అదనపు నూనె వాడకం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఇది క్యాన్సర్ రిస్క్ తో ముడిపడి ఉంటుంది.
ఇలాంటి ఆహార పదార్థాలతో స్టార్చ్, ఆక్సిడైజ్డ్ పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి ఎక్కువగా తీసుకున్న వారిలో రొమ్ము, కడుపు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల ఊబకాయం పెరుగుతుంది, ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి కొన్ని క్యాన్సర్‌లకు ప్రమాద కారకాలుగా చెబుతున్నారు.ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్ ఫుడ్ తీసుకుంటే కడుపు క్యాన్సర్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ ఫుడ్‌లో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫుడ్ తీసుకుంటే కడుపులో జీర్ణక్రియ సమయంలో నైట్రోసమైన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.