ఒక్క వాష్ లో ట్యాన్ పోగొట్టే అద్భుతంగా ఉపయోగపడే చిట్కా ఇదే..!

Divya
చాలామంది పనిరీత్యా ఎండలో తిరుగుతూ ఉంటారు.అలాంటివారికి సూర్యరశ్మి డైరెక్ట్ గా శరీరంపై పడడం వల్ల,ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రతిభాగం టాన్ అవుతుంది.ఈ టాన్‌ కారణంగా ముఖం,ఇతర శరీరం భాగాలు నల్లగా,అందవిహీనంగా,నిర్జీవంగా తయారవుతాయి.ఈ ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ.సూర్యుడని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి మన చర్మాన్ని రక్షించడానికి మెలనిన్‌ ఊత్పత్తి పెరిగి చర్మ కణాల పై భాగానికి బదిలీ అవుతుంది.ఇలా మెలనిన్ చేరటం వల్ల సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాల్లో టాన్‌ కనిపిస్తుంది.అలాంటి ప్రదేశాల్లో ఎటువంటి సంస్కృతి రాసిన కొంతవరకే పని చేస్తుంది.కానీ పర్మినెంట్ గా నలుపు తనాన్ని పోగొట్టలేదు.అలాంటి వారికి ఇంట్లోనే‌ టాన్‌ను తొలగించి,తిరిగి మెరగయినా చర్మాన్ని పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి.అవేంటో చూద్దామా..

దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ తేనె,ఒక స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్పూను శనగపిండి వేసి బాగా కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని అప్లై చేయడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ అప్లై చేసి అరగంటసేపు ఆరనివ్వాలి.ఇలా బాగా ఆరిన తర్వాత మెల్లగా మర్దన చేస్తూ శుభ్రం చేసుకోవాలి.టాన్ అయిపోయిన ప్రతిభాగంలోనూ యూస్ చేసుకోవచ్చు. ఇలా వారానికి రెండు నుంచి మూడు రోజుల వరకు చేయడంతో,నెల రోజుల్లో మీ స్కిన్ మరింత అందంగా, మెరుగ్గా తయారవుతుంది.అంతేకాక ఎవరైనా ఫంక్షన్ లో అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకోవాలన్నా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.జిడ్డు చర్మం కలవారికైతే అద్భుతమైన వరం అని చెప్పవచ్చు.

బొప్పాయిలోని ఎంజైమ్‌లు డెడ్ స్కిన్‌ని తొలగించి,డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తాయి.ఇందులో బీటా - కెరోటిన్‌ పుష్కళంగా ఉంటుంది.అందువల్ల ట్యాన్ పోగొట్టి ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.మరియు మృత కణాలను తొలగించడమే కాక చర్మానికి తేమనందిస్తుంది. దీంతో చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.

కావున మీరు కూడా టాన్ కారణంగా బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: