అన్నానికి బదులు ఇది తింటే ఎంతో ఆరోగ్యం?

Purushottham Vinay
సాధారణంగా మనం జొన్నలతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకుంటాం. ఈ జొన్నల్లో చాలా పోషకాలు శరీరానికి లభిస్తాయి. జొన్నల్లో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వంటి గుణాలు చాలా ఎక్కువగా లభిస్తాయి.ఈ జొన్నలతో మనం రొట్టెలను కూడా తయారు చేసుకోవచ్చు.అయితే జొన్న అంబలిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిది. దీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక జొన్న అంబలిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఇందులోకి మూడు గ్లాసుల నీళ్లు పోసి ఇంకా ఉప్పు వేసి కలుపుకోవాలి.ఆ తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి పిండిని కలుపుతూ ఉడికించాలి. ఈ అంబలిని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉడికించాలి. ఆ తరువాత మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న అంబలి ఈజీగా తయారవుతుంది.ఇక ఈ అంబలిని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.



ఇంకా రక్తహీనత సమస్య తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే ఈ అంబలిని తాగడం వల్ల ఖచ్చితంగా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.ఇక ఈ అంబలిని తాగడం వల్ల కండరాలు ధృడంగా తయారవుతాయి. ప్రతిరోజూ ఈ జొన్న అంబలిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందుతారు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన శరీరంలో వేడి తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మలబద్దం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ జొన్న అంబలిని తీసుకోవడం వల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో ఈ జొన్న అంబలి ఎంతో మేలు చేస్తుంది. ఇక దీనిని పిల్లల , పెద్దలు ఆహారంగా తీసుకోవచ్చు.అయితే జొన్నలతో రొట్టెలే కాకుండా ఇలా అంబలిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: