గబ్బిలాల నుంచి మరో కొత్త వైరస్.. కరోనా కంటే డేంజరట?

praveen
కరోనా వైరస్ ఈ పేరు వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి వెన్నులో తెలియకుండానే భయం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మహమ్మారి వైరస్ సృష్టించిన ప్రళయం అలాంటిది. ఏకంగా ఒక్క దేశంలో కాదు ప్రపంచ దేశాలు అన్నింటిని కూడా కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా తెలియని విధంగా పరిస్థితిని తీసుకువచ్చింది. ఇక కనిపించని శత్రువుపై ప్రపంచం మొత్తం గుడ్డిగా యుద్ధం చేసే విధంగా పరిస్థితులను తీసుకువచ్చింది ఈ మహమ్మారి వైరస్.

 చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా పాగిపోయిన కరోనా వైరస్ ఏకంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్నో కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత వచ్చిన లాక్ డౌన్ పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కూడా అందరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఇక ఈ వైరస్ తగ్గింది అనుకునే లోపే మళ్ళీ కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక ఇప్పుడు మరో వైరస్ కు సంబంధించిన షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

 గబ్బిలాల నుంచే కరోనా వైరస్ వచ్చింది అని ఆరోపణలు ఉన్న వేళ.. ఇక ఇప్పుడు అదే గబ్బిలాల నుంచి మరో వైరస్ కూడా పుట్టుకొచ్చిందట. థాయిలాండ్ లో దీనిని శాస్త్రవేత్తలు గుర్తించారట. ఓ గుహలోని గబ్బిలాల ఎరువును రైతులు పంటల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఎరువు లోనే వైరస్ ఉన్నట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకే అవకాశం కూడా ఉందట. అయితే ఈ వైరస్ కరోనా లాగే ఎంతో ప్రమాదకరమైనది అని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఎంతో వేగంగా వ్యాపించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అయితే ఒక్క వైరస్ తోనే తట్టుకోలేకపోతున్నాం.. ఇప్పుడు మరో వైరస్ ఏంట్రా బాబు అని ఈ విషయం తెలిసి అందరూ తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: