చక్కెర ఎక్కువ తీసుకుంటే వచ్చే జబ్బులు ఇవే?

Purushottham Vinay
ఈ రోజుల్లో మనలో చాలా మంది  జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి కలుషితమైన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల ఎన్నో లేని పోనీ అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు.ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ఖచ్చితంగా  పోషకాలు కావాలి. వాటిని ఖచ్చితంగా సరైన మోతాదులో తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉంటారు. కొంత మందిని గమనిస్తే చాలా ఆరోగ్యంగా యంగ్‌గా కనిపిస్తారు. ఎందుకంటే అందుకు కారణం వారి ఆహారపు అలవాట్లు. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే..  మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక ఈ కోవలోనే చక్కెర కూడా చేరుతుంది. మనలో చాలా మందికి కూడా తీపి ఎక్కువగా తినడం ఇష్టం.ఇక షుగర్ మన శరీరానికి అవసరమే అయినా.. దీన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా లేని పోని రోగాలు రావడం ఖాయం. డబ్లూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలు, పిల్లలైనా తక్కువ మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల వారికి ఖచ్చితంగా అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ఈ సూచన వెనక ఎన్నో శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. చక్కెర కంటెంట్‌ని ఎక్కువగా తీసుకుంటే చాలా రకాల జబ్బులు వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.



చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవుతాయి. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇమ్యూనిటీ లెవల్స్ కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటీస్ ఎటాక్ చేస్తుంది.మనం చక్కెరను ఎక్కువగా తీసుకుంటూ ఉంటే పదే పదే చక్కెర ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది వ్యసనంలా మారిపోతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. రక్తంలో కూడా చక్కెర స్థాయిలు పెరగడం, తగ్గడం వల్ల అలసటగా అనిపిస్తుంది.ఆహారంలో చక్కెరను ఎక్కువగా తీసుకుంటే.. చర్మ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల పింపుల్స్, వృద్ధాప్యం, చర్మం డల్‌గా మారతుంది. దీంతో వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.చక్కెరని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీని వల్ల అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మీ గుంండె, కాలేయం రెండింటికీ మంచిది కాదు. అనారోగ్యకరమైన బరువు ఊబకాయానికి దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: