మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కిడ్నీలది కీలక పాత్ర అనే సంగతి తెలిసిందే. మనం తీసుకునే వివిధ రకాల పానీయాలను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి.శరీరంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి.వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే.. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కిడ్నీల పనితీరును మెరుగు పరిచే అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కిడ్నీలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. నిమ్మ, నారింజ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్‌తో మన శరీరం తేమవంతంగా ఉంటుంది. మన మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటికి పంపేందుకు ఇది సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలోని సిట్రేట్ మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడుతుంది.దోసకాయల్లో
నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
దోసకాయలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవు. దోసకాయలు తినడం వల్ల కిడ్నీల పనితీరు బాగా మెరుగుపడుతుంది.మూత్ర పిండాల ఆరోగ్యంలో సాల్మన్, ట్యూనా వంటి చేపలు ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం ఒమేగా 3 కొవ్వులు చాలా ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటే.. రక్తంలో కొవ్వు స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. అందువల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడ నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్‌గా ఉంటే.. శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటికి పోతాయి. సహజంగా మూత్రపిండాలను రిపేర్ చేయడంలో నీరు బాగా ఉపయోగపడుతుంది.ఇంకా యూరినటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ను దూరం చేయడంలో క్రాన్ బెర్రీస్ కీలక పాత్ర పోషిస్తాయి.క్రమం తప్పకుండా క్రాన్ బెర్రీలను తీసుకోవడం వల్ల మూత్రాశం, మూత్ర పిండాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి.