మనలో చాలా మంది కూడా టీ, కాఫీలను ఎంతో ఇష్టంగా తాగుతారు. శక్తి కొరకు, మానసిక ఉల్లాసం కొరకు, ఎక్కువ సమయం వరకు మేల్కొని ఉండడానికి, ఉత్సాహంగా పనిచేయడానికి అలాగే ఏకాగ్రతను పెంచుకోవడానికి టీ, కాఫీలను ఎక్కువగా తాగుతూ ఉంటారు.అయితే టీ, కాఫీలను తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కెఫిన్ ఎక్కువగా వెళ్తుంది. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణసమస్యలు, చికికు, తలనొప్పి, మూత్ర సంబంధిత సమస్యలు, నిద్రలేమి ఇంకా తరుచూ భయంగా ఉండడం వంటి వివిధ రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం కెఫిన్ ను తక్కువగా తీసుకోవాలి. మనం రోజుకు గరిష్టంగా 400 మిల్లీ గ్రాములు అంటే 3 నుండి 5 కప్పుల టీ,కాఫీని మాత్రమే తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ కెఫిన్ ను మనం అస్సలు తీసుకోకూడదు.అయితే కెఫిన్ ను తీసుకోకుండా కూడా మనం మంచి శక్తిని పొందవచ్చు.
ఈ కాఫీ,టీ లకు ప్రత్యమ్నాయంగా ఇతర ఆహారాలను, పనులను చేయడం వల్ల మనం చాలా ఉత్సాహంగా, ఏకాగ్రతతో పని చేసుకోవచ్చు. దీంతో తక్కువ మొత్తంలో కెఫిన్ అనేది మన శరీరంలోకి వెళ్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. కెఫిన్ కు ప్రత్యమ్నాయంగా ఇతర మార్గాల ద్వారా మనం శక్తిని ఎలా పొందాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడు వాటికి బదులుగా మీరు సలాడ్ ను తీసుకోవాలి. క్యాబేజి, బచ్చలికూర, కీరదోస వంటి వాటితో పాటు నారింజ, అరటిపండ్లు ఇంకా యాపిల్స్ వంటి వాటితో సలాడ్ ను చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి ఈజీగా లభిస్తుంది.అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే కాపీ, టీ లకు బదులుగా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల కూడా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. దీంతో మన మానసిక స్థితి బాగా మెరుగుపడుతుంది.