మనం సాధారణంగా పచ్చికొబ్బరితో చేసే వంటకాల్లో కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. కొబ్బరి పచ్చడి అనేది ఖచ్చితంగా చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.అన్నం, అల్పాహారాలతో తినడానికి ఇది చాలా బాగుంటుంది.తరుచూ చేసే ఈ కొబ్బరి పచ్చడిని మనం ఇంకా మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. పుదీనా వేసి చేసే ఈ కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ విధంగా తయారు చేసే పచ్చడిని ఖచ్చితంగా అందరూ లొట్టలేసుకుంటూ ఇష్టంగా తింటారు. మరింత రుచిగా పుదీనా వేసి కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొబ్బరి పుదీనా పచ్చడి తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత ధనియాలు,
జీలకర్ర వేసి వేయించాలి. చివరగా నువ్వులు కూడా వేసి వేయించాలి.
ఆ తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనెని వేసి వేడి చేయాలి. ఆ తరువాత పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత టమాట ముక్కలు, పుదీనా ఆకులు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే దాకా మగ్గించాలి. ఆ టమాట ముక్కలు మగ్గిన తరువాత
స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో ముందుగా వేయించిన దినుసులు వేసి బాగా మెత్తగా
మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే వేయించిన పదార్థాలన్నింటిని కూడా వేసుకోవాలి. తరువాత ఉప్పు, చింతపండు ఇంకా
వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా
మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఈ పచ్చడిని తాళింపు వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే కొబ్బరి పుదీనా పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నంతో, అల్పాహారాలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.