పొలిమేర సినిమాలో చూపించిన ఈ గుడి గురించి ఈ విషయాలు తెలుసా..?
అయితే ఈ గుడి ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వద్ద గండికోటలో ఉన్నదట.. మాధవ రాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో 16వ శతాబ్దపు దేవాలయంగా గుర్తించడం జరిగిందట.అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఎక్కువగా ఉండేదట. దీనిని మాధవ పెరుమాళ్ దేవాలయంగా కూడా పిలిచేవారట. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రముఖత కలిగిన స్మారక చిహ్నం గా కూడా గుర్తించడం జరిగిందట. ఈ గుడిలోనే రాధే శ్యామ్, సైరా నరసింహారెడ్డి, మర్యాదరామన్న వంటి చిత్రాలు కూడా సినిమా షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఇక గుడి చరిత్ర విషయానికి వస్తే ఆలయంలో కళనిర్మాణ గుర్తులు ఆధారంగా ఈ దేవాలయం 16వ శతాబ్దంలోని మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లుగా తెలుస్తున్నది. ఆలయానికి సంబంధించిన మొదటి ప్రస్తావన 16వ శతాబ్దంలోని శాసనాలలో ఉన్నట్లుగా వేద పండితులు గుర్తించారు.. ముఖ్యంగా గండికోటలో విజయనగరం కాలం నాటి రాజుల సైతం ఈ గుడిని నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయట. పాప తిమ్మరాజు అనే వ్యక్తి తో సహా అనేకమంది వ్యక్తులు వీటిని నిర్మించినట్లు సమాచారం.
ఇక ఈ గుడిలో నిధులు ఉన్నాయని విషయానికి వస్తే మహమ్మదీయులు దాడుల వల్ల ఈ గుడి చాలా కూలిపోయిందట. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని కూడా అక్కడి ప్రజలు మైదుకూరుకు తలరించినట్లు ఆధారాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఈ గుడిలో ఎలాంటివి ఏమీ లేవని.. అసాంఘిక కార్యకలాపాలు జరిగి అవకాశం ఎక్కువగా ఉందని గుడిని మూసేస్తూ ఉంటారట.. కేవలం అప్పుడప్పుడు టూరిస్టులు వెళ్లిన సమయంలోనే గేట్లు తీరుస్తారని స్థానికులు తెలుపుతున్నారు. కానీ ఈ గుడి గోడల పైన పలు ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయట. ఇందులో ఎలాంటి నిధులు లేవని తెలుపుతున్నారు.