గడ గడ లాడించే చలి కాలం వచ్చేసింది. ఇలా వాతావరణ పరిస్థితులు మారేటప్పుడల్లా జలుబు, దగ్గు ఇంకా జ్వరం అనేవి కామన్ గా వచ్చే అనారోగ్య సమస్యలు.ఇంకా అలాగే ఇంకొందరిలో ఇమ్యూనిటీ లోపించి చాలా ఇన్ ఫెక్షన్లు వస్తాయి. ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాంటే శరీరంలో ఖచ్చితంగా తగినంత రోగ నిరోధక
శక్తి ఉండాలి. ముఖ్యంగా చలి కాలంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇంకా పలు రకాల ఇన్ ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సరైన ఆహారం తీసుకోవాలి.ఇప్పుడు చెప్పబోయే సూప్ ని సీజన్లు మారే సమయంలో తాగడం వల్ల.. శరీరానికి ఖచ్చితంగా మంచి బూస్టింగ్ అందుతుంది. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఇక ఈ బీట్ రూట్ సూప్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముందుగా మీరు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పాయలు, టమాటాలు, క్యారెట్, బీట్ రూట్స్, జీల కర్ర ఇంకా ఒక కప్పు నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్ లో ప్రెజర్ పోయి.. చల్లారేంత దాకా పక్కకు పెట్టుకోవాలి. ఆ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి.. ఉడికిన కూరగాయలను బ్లెండర్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మందపాటి పాన్ తీసుకోండి. ఇందులో కొద్దిగా నూనెని వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఆ పాన్ లో వేసి పచ్చి వాసన పోయేంత దాకా వేయించుకోవాలి.అవసరం అయితే కొద్దిగా నీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా,
మిరియాల పొడి ఇంకా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇక సూప్ లా దగ్గరకి చిక్కబడ్డాక
స్టవ్ ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు స్ప్రింగ్
ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకోవాలి.అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీట్ రూట్ సూప్ రెడీ అవుతుంది. ఈ సూప్ ని తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి అనేక అనారోగ్య సమస్యలు ఈజీగా దూరం అవుతాయి. డయాబెటీస్ ఉన్న వారు కూడా ఈ సూప్ ని భయం లేకుండా తాగవచ్చు.