ఆపిల్ పండ్లని ఇలా తింటే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
రోజూ ఒక యాపిల్ పండును తినడం వల్ల జబ్బులు రాకుండా వైద్యునికి దూరంగా ఉండవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ఆపిల్ పండ్లు ఆరోగ్యంగా పరంగానే కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి.వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో ఆపిల్ పండ్లు ఎంతో సహాయపడతాయి. ఆపిల్ పండ్లను తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ పండ్లను తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలాగే ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆస్థమా వంటి అనారోగ్య సమస్యలు ఈజీగా దూరమవుతాయి. మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇంకా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.అయితే ఈ ఆపిల్ పండ్లను తొక్కతో తింటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



ఆపిల్ పండ్ల తొక్కలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే అనేక రకాలుగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి. అలాగే ఆపిల్ పండ్లను తొక్కతో తింటేనే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఇంకా అలాగే ఆపిల్ పండ్లపై ఉండే తొక్కను తీసేసి తిన్నాకూడా మేలు కలుగుతుంది.ఇక ఆపిల్ సైడ్ వెనిగర్ ను కూడా తొక్క తీసిన ఆపిల్ పండ్లతోనే తయారు చేస్తారు. కాబట్టి ఆపిల్ పండ్లను తొక్క తీసి తిన్నా కూడా మేలు కలుగుతుంది. ఈ ఆపిల్ పండ్లను ఎలా తినాలనేది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆపిల్ పండ్లు అందంగా, మెరుస్తూ కనబడాలని వాటిపై రసాయనాలను స్ప్రే చేయడంతో పాటు ఇంకా అలాగే మైనాన్ని కూడా పూస్తూ ఉంటారు. అందుకే వాటిని తినే ముందు శుభ్రంగా కడిగి తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: