ప్రతి రోజూ ఖచ్చితంగా 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ సరిపడ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో తగిన నీరు లేకపోతే డీహైడ్రేషన్ కు గురై, ప్రాణాలే పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది కాబట్టి తగిన నీటిని తాగాలి. అయితే నీళ్లను ఎలా పడితే అలా తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన మార్గంలో నీరు తాగక పోవడం వల్ల గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ఓ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం నీరు తాగేటప్పుడు ఖచ్చితంగా పలు సూచనలు పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ రోజుల్లో చాలా మంది కూడా నీరు తాగడానికి ప్లాస్టిక్ బాటిల్సే వినియోగిస్తున్నారు. అయితే ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీరు తాగకూడదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతాయి. దాదాపు 80 శాతం మంది బ్లడ్ లో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం అనేది ఉందని తేలింది. ఇవి ఖచ్చితంగా శరీరంలోని పలు అవయవాలను దెబ్బ తీస్తున్నాయి.
అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.చాలా మంది దాహం వేసినప్పుడే నీరు తాగుతున్నారు కానీ.. అర గంటకు లేదా గంటకు అయినా ఓ సారైనా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. యాక్టీవ్ గా ఉంటారు. కాబట్టి రోజు తగినంత నీరు తీసుకోవాలి.అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీటిని తాగ కూడదు. ఇలా తాగడం వల్ల తిన్న ఆహారం అనేది త్వరగా జీర్ణం కాదు. అందువల్ల జీర్ణ సమస్యలను ఫేస్ చేయాలి. మధ్యలో ఒక్కసారి మాత్రం తాగితే సరిపోతుంది.నిలబడి నీళ్లు అస్సలు తాగకూడదు.చాలా మందికి కూడా ఈ విషయం తెలీదు. నీళ్లను ఎప్పుడూ నిలబడి ఇంకా వేగంగా తాగకూడదు. ఎప్పుడు కూడా కూర్చుని రిలాక్స్ గా తాగాలి. నిలబడి నీళ్లను తాగితే కడుపుపై ప్రభావం పడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు ఈజీగా తలెత్తుతాయి.చాలా మంది కూడా ఫ్రిజ్ లో నుంచి బాగా కూలింగ్ ఉన్న నీటిని ఎక్కువగా తాగేస్తూంటారు. అయితే ఇలా చేయడం చాలా తప్పు. చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.