ఉప్పు ఎక్కువగా తింటే కలిగే తీవ్ర నష్టాలు?
మన శరీరంలో నీరు తగినంత ఉండేలా చేయడంలో, నరాలు ఇంకా కండరాల పనితీరును మెరుగుపరచడంలో, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేయడంలో ఇలా చాలా రకాలుగా ఉప్పు మనకు సహాయపడుతుంది. ఉప్పు మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వివిధ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఉప్పు మన శరీరంపై ఏవిధంగా చెడు ప్రభావాలను చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది. అందువల్ల రక్త పరిమాణం పెరిగి రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా రక్తపోటుకు కూడా దారి తీస్తుంది.
ఇంకా అంతేకాకుండా అధికంగా ఉండే రక్తపోటు గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.అలాగే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇంకా అలాగే అధికంగా తీసుకునే ఈ ఉప్పు మూత్రపిండాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.మూత్రపిండాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.అంతేకాకుండా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.ఇంకా అలాగే కంటిచూపు కూడా తగ్గుతుంది.ఖచ్చితంగా దృష్టి లోపాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే క్యాల్షియం మూత్రం ద్వారా బయటకు ఎక్కువగా విసర్జించబడుతుంది.అందువల్ల ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. మన ఎముకలు గుల్లగా మారతాయి. ఈ విధంగా ఉప్పు మన శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని కాబట్టి దీనిని వీలనైంత తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.