జిమ్ము చేస్తున్న సమయంలో గుండెపోటు రావడానికి కారణాలు ఇవే..!!
జిమ్ చేస్తున్నప్పుడు చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో గుండె నాళాలలో అడ్డంకులు ఏవైనా ఏర్పడితే రక్తప్రసరణ తగ్గిపోయి అది గుండెపోటుకు దారితీసేలా ఉంటుందట.
జిమ్ చేస్తున్న సమయంలో మనం చేసేటువంటి పనుల వల్ల అధిక శ్రమకు గురవుతాము.. దీనివల్ల తీవ్రమైన ఒత్తిడి గుండెపైన పడుతుంది. ఈ ప్రభావం కూడా గుండెపోటుకు దారితీస్తుందట.
చాలామందికి వంశపారపర్యంగా కూడా గుండె సమస్యలకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుచేతనే అలాంటి ఇబ్బందులు ఉన్నవారు జిమ్ వర్కౌట్లు చాలా తగ్గించడం మంచిది.
ఆందోళన ఎక్కువగా ఉన్నవారు వ్యాయామం చేయడం మంచిది. జిమ్ వర్కౌట్లు చాలా తక్కువ మోతాదులలో చేసుకోవడం మంచిది. ఒత్తిడి ఎక్కువగా గురయ్యేవారు అడ్రినలిన్ వంటి హార్మోన్లలో పెరుగుదల వల్ల గుండె ఒత్తిడికి గురవుతుందట.
జిమ్ములో చాలా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నప్పుడు వామప్ కచ్చితంగా చేయాలంట. ఇలాంటివి చేయడం వల్ల గుండె వేగం రక్తపోటు సమస్యలు ఎలాంటి ఇబ్బందులు సంభవించవు. ఇలా చేయకుండా డైరెక్ట్ గా జిమ్ వర్కౌంటు చేస్తే సమస్య మరింత పెద్దదిగా మారుతుందట.
ట్రెడ్మిల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మితిమీరిన వేగం చేయడం వల్ల గుండెపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందట. ట్రేడ్మీల్ లేదా మరేదైనా జిమ్ములో చేస్తున్నప్పుడు చాతినొప్పి శ్వాస ఆడక పోవడం తల తిరగడం వంటి సమస్యలు ఎదురైతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
జిమ్ చేస్తున్న సమయంలో బాడి తొందరగా డిహైడ్రేషన్ అవుతుంది అందుకే వాటర్ ని ఖచ్చితంగా తాగుతూ ఉండాలి.