ఈ టిప్ పాటిస్తే హెల్తీ బ్యూటీ ఫేస్ మీ సొంతం?

Purushottham Vinay
చాలా మంది కూడా ఎక్కువగా మొటిమలు, మచ్చలు, చర్మం ముడతలు పడడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని అందంగా, తెల్లగా మార్చుకోవచ్చు.ఈ పదార్థాలను వాడడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే మన ముఖ చర్మం బిగుతుగా తయారవుతుంది. ముడతలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ టిప్ ని తయారు చేసుకోవడం చాలా సులభం కూడా. ముఖాన్ని అందంగా మార్చే ఈ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలి… మనం ఉపయోగించాల్సిన ఆ రెండు పదార్థాలు ఏమిటి… వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం పసుపును, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది.


ముందుగా ముఖానికి సరిపోయే పసుపును కళాయిలో వేసి దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో తగినంత తేనె కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచాలి.ఆ తరువాత తరువాత చల్లటి నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ముఖం ఆరోగ్యంగా ఇంకా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎందుకంటే పసుపు, తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మచ్చలు ఇంకా మొటిమలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. ఈ విధంగా ఈ టిప్ ని మీరు వారానికి రెండు నుండి మూడుసార్లు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖం అందంగా కనబడాలనుకునే వారు ఈ టిప్ ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ వాడండి. అందమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోండి. ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: