నేటి కాలంలో మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది కాలేయానికి సంబంధించిన సమస్యల బారిన పడుతున్నారు.అయితే మన కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మనం ఖచ్చితంగా తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.అందుకే కాలేయ సమస్యలతో బాధపడే వారు అలాగే కాలేయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలనుకునే వారు ఇప్పుడు చెప్పే స్మూతీని తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి మనం ముందుగా క్యారెట్ ను, బీట్ రూట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. క్యారెట్ , బీట్ రూట్ ను తీసుకోవడం వల్ల కాలేయ కణాల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వాటి పనితీరు కూడా చాలా బాగా ఉంటుంది.
ఫ్యాటీ లివర్ సమస్య నుండి బయటపడేయడంలో కూడా ఈ కూరగాయలు బాగా సహాయపడతాయి.ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి మీరు ముందుగా బీట్ రూట్ కు అలాగే క్యారెట్ కు ఉండే చెక్కును తీసి వేయాలి. ఆ తరువాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే తగినన్ని నీళ్లు, ఒక ఇంచు అల్లం ముక్క ఇంకా గుప్పెడు కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ స్మూతీని నేరుగా తాగవచ్చు లేదా వడకట్టుకుని తాగవచ్చు. ఈ విధంగా స్మూతీపి తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు అనేది పెరుగుతుంది. ఇంకా కాలేయం తన విధులను తను సక్రమంగా నిర్వర్తిస్తుంది. మన కాలేయ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఈ స్మూతీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఈ స్మూతీ మనకు బాగా సహాయపడుతుంది.