ఈ పప్పులు తింటే అంతులేని బలం మీ సొంతం?

Purushottham Vinay
ఈ రోజుల్లో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాగా బాధపడుతున్నారు. ప్రోటీన్ లోపించడం వల్ల హార్మోన్ల సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. కండపుష్టి కూడా తగ్గిపోతుంది. ఇంకా కండరాల పెరుగుదల తగ్గి శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే తగిన ప్రోటీన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇక మన శరీరం ఎంత బరువు ఉంటుందో మనకు రోజూ అన్ని గ్రాముల ప్రోటీన్ మనకు అవసరమవుతుంది. మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ మనకు పప్పుదినుసుల్లో  లభిస్తుంది.ఇంకా అలాగే పప్పు దినుసులను చికెన్, మటన్ వంటి ఇతర ఆహారాలతో పోల్చినప్పుడు ఇవి తక్కువ ధరలో లభిస్తాయని చెప్పవచ్చు. ఇంకా అలాగే మనకు అన్ని రకాల పప్పులు మార్కెట్ లో లభిస్తాయి. మన ఇంట్లో ఖచ్చితంగా 3 నుండి 4 రకాల పప్పులు ఉండేలా చూసుకోవాలి.అన్నింటికంటే చాలా తేలికగా జీర్ణమయ్యే పప్పులల్లో పెసరపప్పు ఒకటి.దీన్ని తీసుకోవడం వల్ల మనకు 25 శాతం ప్రోటీన్ లభిస్తుంది. వీలైనంత వరకు పొట్టు ఉండే పప్పునే తీసుకోవాలి. పొట్టు తీయడం వల్ల పప్పు దినుసుల్లో ప్రోటీన్ అనేది తగ్గుతుంది.


ఇంకా ఫైబర్ కూడా తొలగిపోతుంది.ఇంకా అదే విధంగా పొట్టు తీయని పప్పులు నెమ్మదిగా జీర్ణమవుతాయి.అందువల్ల రక్తంలో చక్కెరస్థాయిలు వెంటనే పెరగకుండా ఉంటాయి. అలాగే మనం తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా ఉంటుంది.కాబట్టి పొట్టు ఉండే పప్పులను వాడడమే మంచిది.అయితే సాధారణంగా మనం పెసరపప్పు, కందిపప్పు ఇంకా శనగపప్పు వంటి వాటినే ఎక్కువగా వాడుతూ ఉంటాము.అలాగే సోయా గింజల పప్పును కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పప్పును మాత్రం పొట్టు తీసేసిన తరువాత మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా మన ఇంట్లో ఈ పప్పులను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి రోజూ 50 నుండి 100 గ్రాముల పప్పు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అందువల్ల 15 నుండి 20 గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది.ఇంకా ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది.కాబట్టి మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పప్పును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: