మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా..తస్మాత్ జాగ్రత్త..!

Divya
సాధారణంగా వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే డబ్ల్యూహెచ్ఓ సంస్థ నీటిని నిల్వ ఉంచకూడదు అని , ఎక్కడికక్కడ ఇంటిని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలోనే దోమల సంతానోత్పత్తి చివరి దశకు చేరుకొని చిన్నచిన్న దోమలు బయటకి వస్తాయి. ఇక ఆ తర్వాత మలేరియా, చికెన్ గున్యా , డెంగ్యూ వంటి జ్వరాలు రావడం ప్రారంభమవుతాయి. ఇక ఈ వానాకాలం నెలలో తప్పకుండా వీటి బెడద బారిన పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇకపోతే చాలామంది వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి రసాయనాలతో కూడిన కాయిల్స్ వినియోగిస్తున్నారు.. వీటి వాడకం మంచిదేనా? లేక ఏదైనా దుష్ప్రభావాలు కలగవచ్చా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చూద్దాం. ప్రస్తుతం మార్కెట్లో లభించే మస్కిటో కాయిల్స్ కాల్చడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. వీటి నుంచి వచ్చే పొగ దోమలను చంపడమే కాదు మనుషుల ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. మస్కిటో కాయిల్స్ నుంచి వచ్చే పొగ సిగరెట్ల పొగ కంటే హానికరమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా వీటిని తయారు చేసేటప్పుడు హానికరమైన రసాయనాలను కలిపి తయారు చేస్తారట. ఇక తరచూ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందని.. అంతేకాదు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీటి కారణంగా ఆస్తమా , చర్మ ఎలర్జీ వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వీటినుంచి వెలువడే పొగ మెదడును కూడా ప్రభావితం చేస్తుందని , తీవ్ర మెదడు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు దోమల బెడద సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మస్కిటో కాయిల్స్ కి దూరంగా ఉండడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: