ఈ యాప్ ద్వారా.. ఇంట్లో ఉండే డెంగ్యూ జ్వరాన్ని చెక్ చేసుకోవచ్చట?
అయితే ఇప్పుడు ఏకంగా జ్వరం వస్తే భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇంట్లో ఉండే ఏకంగా స్మార్ట్ఫోన్లో డెంగ్యూ ఫీవర్ కనుక్కొనే సౌలభ్యం అందుబాటులో ఉందట. ఒక యాప్ వినియోగించుకుని మీ శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయొచ్చట... ఆ యాప్ ధర్మామీటర్ లాగా పనిచేస్తుందట. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు స్మార్ట్ ఫోన్ ను ధర్మ మీటర్ గా మార్చడానికి ఫీవర్ ఫోన్ యాప్ అభివృద్ధి చేశారు. ఎలాంటి హార్డ్వేర్ కనెక్షన్ లేకుండానే జ్వరాన్ని చెక్ చేసుకోవడానికి ఈ యాప్ అనుమతిస్తుందట. ఈ యాప్ ఫోన్లో మీ ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తూ ఉంటుంది.
అంతే కాకుండా అంతర్ నిర్మిత సెన్సార్ పరికరం వద్దకు చేరిన వేడి వస్తువును కూడా గుర్తిస్తుంది. యాప్ ఆన్ చేసి మీ నుదుటి ముందు పెట్టుకోవాలి.. ఫోన్ టచ్ స్క్రీన్ నుదురు ముందు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీకు జ్వరం ఎక్కువగా ఉంటే యాప్ హెచ్చరిస్తుందట ఇక ఆ సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి డెంగ్యూ టెస్ట్ చేయించుకుంటే మంచిదట. ఈ యాప్ కాకుండా ఇంకా చాలా యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బాడీ టెంపరేచర్ ధర్మామీటర్, బాడీ టెంపరేచర్ యాప్, ఫీవర్ ట్రాకర్ కోసం ధర్మామీటర్ లాంటి యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.