కలవర పెడుతున్న కళ్ళ కలక .. లక్షణాలు ఇవే..!!
1).కన్ను ఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం.
2). ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు.
కళ్ళ కలక వారం రోజులుగా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కన్ను ఎరగా మారడం, కంటి నుంచి నీరు కారడం, దురద, కంటి నొప్పి, కంటి రెప్పలు అతుక్కుపోవడం, వాపు రావడం, వంటివి దీని లక్షణాలు.. కళ్లకలక బ్యాక్టీరియా వైరస్ వల్ల వస్తుంది. బ్యాక్టీరియా ద్వారా వచ్చిన వారిలో ఐదు రోజుల్లో తగ్గిపోతుంది. అదే వైరస్ వల్ల వస్తే..ఒకటి లేదా రెండు వారాల వరకు ఉంటుంది. అయితే ఈ వ్యాధి ప్రమాదకరం కాదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కళ్ళ కలక అంటే :
దుమ్ము, ధూళి, చలి, వేడి నీళ్లు, కంటిపై ప్రభావం చూపించినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. దీన్నే కళ్ళ కలక అంటారు. ఇది ఈ మధ్యకాలంలో ఎప్పుడు విస్తరించలేదు. ఇప్పుడు విద్యార్థులకు ఎక్కువగా వస్తుంది. చిన్న పిల్లలకు వస్తే కొంచెం ప్రమాదకరంగా ఉంటుందని..వైద్యులు అంటున్నారు.
కళ్ల కలకకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు :
కళ్ల కలక వచ్చినవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడం మంచిది. లేకుంటే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది.
బాధితుల వస్తువులను తాకడం వంటివి చేయవద్దు. పొరపాటున ముట్టుకుంటే చేతులను శుభ్రం చేసుకోవాలి.
కళ్ల కలక వచ్చిన వారికి వేసే డ్రాప్స్ ను ఇతరులు వాడకూడదు.
కళ్లద్దాలు వాడడం,కొంతవరకు మేలు కలుగుతుంది.
వ్యాధి నివారణకు యాంటీబయోటిక్ ఐ డ్రాప్స్, లూబ్రికేటింగ్, వాడితే సరిపోతుంది.
కళ్ల కలక అనేది సాధారణ కంటి జబ్బు కానీ మొదట్లోనే దీనిని నివారించాలి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కనులను ఎప్పటికప్పుడు మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యవసరమైతే అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రదించడం మంచిది.