మెంతులు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో కూడా ఈ మెంతులు ఖచ్చితంగా ఉంటాయి. వంటల్లో మెంతులను ఎక్కువగా వాడుతుంటారు.ఇక వీటి రుచి చేదుగా ఉన్నా కూడా చాలా పోషకాలు నిండి ఉంటాయి. కొంతమంది వెయిట్ లాస్ అవ్వడం కోసం మెంతులను నైట్ అంతా కూడా వాటర్ లో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటారు. అయితే మొలకెత్తిన మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే అస్సలు వాటిని తినకుండా ఉండలేరు.సాధారణ మెంతులతో పోలిస్తే మొలకెత్తిన మెంతుల్లో పోషకాలనేవి రెట్టింపు ఉంటాయి.రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్లు మొలకెత్తిన మెంతులను కనుక తీసుకుంటే మీ శరీరంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి.ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన మెంతులు నిజంగా ఒక వారం అని చెప్పవచ్చు.అలాగే ఈ మొలకెత్తిన మెంతులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. అలాగే మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల ఎముకలు కూడా చాలా దృఢంగా మారతాయి. అలాగే అసలు మోకాళ్ళ నొప్పులు కూడా మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
మోకాళ్ళ నొప్పులు కనుక ఎక్కువ ఉంటే వాటి నుంచి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది.ఇక ఈ మొలకెత్తిన మెంతులను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు కూడా సూపర్ ఫాస్ట్ గా కరుగుతాయి. దాంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.అలాగే పొట్ట కొవ్వు కూడా కొద్ది రోజుల్లోనే మాయం అవుతుంది. అంతేకాదు మొలకెత్తిన మెంతులను తింటే
గుండె చాలా ఆరోగ్యంగా మారుతుంది. అలాగే
క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఈజీఫా తగ్గుతుంది. ఇంకా స్త్రీలలో నెలసరి సమస్యలు కూడా ఈజీగా దూరం అవుతాయి.మొలకెత్తిన మెంతుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది మన హైపర్ టెన్షన్ ను ఈజీగా కంట్రోల్ చేస్తుంది.ఇక మొలకెత్తిన మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. చాలా జబ్బులు మన దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి. మొలకెత్తిన మెంతులు నిత్యం తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా చర్మం చాలా ఆరోగ్యంగా యవ్వనంగా మెరుస్తుంది. కాబట్టి మొలకెత్తిన మెంతులను తప్పకుండా తినండి. వీటిని నేరుగా తినలేము అనుకునేవారు సలాడ్స్ లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.