ఈ కాలంలో చాలా మంది ఈజీగా, త్వరగా అవుతుందని ప్రతి ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించేస్తున్నారు. కానీ, అలా చేయడం వల్ల చాలా పోషక విలువలు కోల్పోతున్నారు. అందువల్ల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. పిల్లలకు తినిపిండం ఈజీగా అవుతుందని పండ్లను కూడా ప్రెజర్ కుక్కర్లో ఉడికిస్తుంటారు. కానీ, ఇలా మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకంటే వాటిలోని పోషకాలు కోల్పోయాక.. వాటిని పిల్లలకు తినిపించానా కూడా వృధానే అవుతుంది.అందుకే వీలైనంత వరకు ప్రెజర్ కుక్కర్‌లో అన్ని రకాల ఆహారాలను ఉడికించడం మానుకోవడం మంచిది. సమయం ఎక్కువైనా కానీ సాధారణ పద్ధతుల్లో ఉడికించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ప్రెజర్ కుక్కర్లో ఏ ఆహారాలు చేసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అసలు యాపిల్, బేరిపండ్లను పొరపాటున ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించవద్దు. ఎందుకంటే అలా చేస్తే.. అందులోని పోషకాలు పూర్తిగా పోతాయి. సాధారణ గిన్నెల్లో వీటిని ఉడికించడం మంచిది.అలాగే పాలు, పెరుగు, పనీర్ వంటివి తినే వస్తువులను పొరపాటున కూడా ప్రెజర్ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే అది ఖచ్చితంగా పేలే ప్రమాదం ఉంది.
ఇంకా, ఇది దాని రుచిని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తుంది.అలాగే బీన్స్‌లో లెక్టిన్ ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది కూడా. సరిగ్గా ఉడికించకపోతే ఖచ్చితంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ ఆహారం శరీరానికి చాలా ప్రమాదకరం. అందుకే ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించి తినడం వలన కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి.ఇక బియ్యాన్ని ఉడికించడం ద్వారానే వండుతారు. అయితే, సరిగ్గా ఉడికించి తినకపోతే మాత్రం ఆరోగ్యానికి ఖచ్చితంగా హానీ కలుగుతుంది.అందుకే ప్రెజర్ కుక్కర్‌లో ఆహారం వండొద్దు. ఒకవేళ ఆహారాన్ని వండేటప్పుడు నీటి పరిమాణం ఇంకా ఉడికించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే ఆకుకూరలు, బచ్చలికూర, పాలకూర, కొల్లార్డ్ గ్రీన్ వెజిటేబుల్స్‌లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అది అధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు అందులో ఖచ్చితంగా విషపూరిత నైట్రోసమైన్ స్థాయి పెరుగుతుంది. నైట్రేట్‌లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రెజర్ కుక్కర్‌లో ఈ కూరగాయలను ఉడికించొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. వేడి వల్ల నైట్రోసమైన్‌ల స్థాయి పెరిగి, ఆరోగ్యానికి హానీ కలుగుతుంది.