ఈ పండ్లు చూడ్డానికి చిన్నగా ఉన్నా..పోషకాలలో మిన్నా..!

Divya
సాధారణంగా మల్బరి పండ్లు తినడానికి అంతగా ఎవరు ఇష్టపడరు కానీ.ఇందులోని పోషకాలు గురించి తెలిస్తే మాత్రం ఇకమీదట అస్సలు అలా చేయలేరు. ఇవి ద్రాక్ష పండ్ల వలె చిన్నగా ఉండి తినడానికి తియ్యగా పుల్లగా ఉంటాయి.ఈ పండ్లలో విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ కె,పొటాషియం,ఐరన్,కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.కావున ఈ పండును రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి..
చాలామంది ఈ కాలంలో అధిక బరువుతో బాధపడుతున్నారు.అలాంటి వారు మల్బరీ పండ్లను  డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.మల్బరీ పండ్లలో కేలరీలు చాలా తక్కువగా లభిస్తాయి.ఈ పండును తరుచూ తీసుకోవడంతో ఇందులో ఉండే అధిక ఫైబర్ తొందరగా కడుపు నిండిన భావనను కలిగించి,తక్కువ తినేందుకు దోహద పడుతుంది.దానితో బరువు తగ్గవచ్చు.
జుట్టు ఆరోగ్యం పెంపొందించుకొనేందుకు..
ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయ.ఇవి తరుచూ తీసుకోవడంతో చర్మ  ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.మరియు తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుకోవచ్చు.అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయి.
ఎముకల దృఢత్వానికి..
మల్బరీ పండ్లు తరుచూ తీసుకోవడం వల్ల,ఎముకల బలానికి కూడా ఎంతో సహాయపడతాయి.ఈ పండ్లలో ఉండే విటమిన్ సి,కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.ఎముకల డోళ్ళ,ఆస్తియో పోరోసిస్,కిళ్ళ నొప్పులు,మోకాళ్ళ నొప్పులు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
మధుమేహం..
మధుమేహం ఉన్నవారికి కూడా ఈ పండ్లు ఎంతో ప్రయోజనకారిగా  ఉంటాయి.వారు కూడా ఈ పండ్లను ఎటువంటి భయం లేకుండా తినొచ్చు.రోజూ క్రమం తప్పకుండా మల్బరీ పండ్లను తినడంతో,రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలోకి వస్తాయి.
మెదడు పెరుగుదలకు..
మల్బరీ పండ్లలో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడుతుంది.మరియు ఈ పండ్లు జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
రక్తహీనత తగ్గించుకోవడానికి..
ఈ పండ్లను తరుచు తినడంతో రక్త ప్రసరణ పెంచవచ్చు. దీనిలో అధికంగా ఉండే ఐరన్ ఎర్ర రక్తకణాల వృద్ధి పెంచడానికి సహాయపడతాయి.ఈ పండ్లు మన శరీరంలో రక్తాన్ని పెంచుతాయి.
కంటి ఆరోగ్యం..
ఇందులో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.ఈ పండ్లు మన కంటిచూపును మెరుగుపరచడానికి సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: