పుట్టగొడుగులు తింటున్నారా? అయితే జాగ్రత్త?

Purushottham Vinay
పుట్టగొడుగుల గురించి అందరికీ తెలిసిందే. వీటిని చాలమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా లభించే ఈ పుట్ట గొడుగులలో చాలా రకాలు ఉన్నాయి.వాటిలో అన్ని రకాలు కూడా తినడానికి పనికి రావు. అందులో కేవలం " ఆగరికస్ బీస్పోరాస్ అనే జాతికి చెందిన పుట్టగొడుగును మాత్రమే తినడానికి ఉపయోగిస్తారు. ఇక దీనినే సాధారణ పుట్టగొడుగు అని అంటారు. అయితే పుట్టగొడుగులలో ఎలాంటి పత్రహరితం అనేది ఉండదు కాబట్టి వీటికి రంగు ఉండదు.ఇవి ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి.అయితే పుట్టగొడుగులతో రకరాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాము. కర్రీ, సూప్, సలాడ్.. ఇలా రకరకాలుగా వంటకాలు తయారు చేసుకోని తింటూ ఉంటాము.ఈ పుట్టగొడుగులని తినడం వల్ల చాలా ప్రయోజనలు  ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే ఇందులో శరీరానికి అవసరమైన పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ సి, వంటి వాటితో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పుట్టగొడుగులను మంచి పౌష్టికాహారంగా చెబుతుంటారు న్యూట్రీషియన్స్. పుట్టగొడుగుల్లో కొలెస్ట్రాల్ ను తగ్గించే బీటా గ్లోకాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.



కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను ఆహార డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా పొట్టగొడుగులు మంచి ఔషధంలాగా పని చేస్తాయి.ఎన్నో రకాల క్యాన్సర్ కరకాలను కూడా పుట్టగొడుగులు నివారిస్తాయని పలు అధ్యయనలు చెబుతున్నాయి.అయితే ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినడం వల్ల అంతకు మించి నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పుట్టగొడుగులు శిలీంద్రాల జాతికి చెందినవి కాబట్టి వీటిని ఎక్కువగా తింటే ఇమ్యూనిటీ డిజాస్టర్స్ ఏర్పడే ప్రమాదం ఉందట. ఇంకా అలాగే శ్వాస సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్నవారు.. పుట్టగొడుగులకు చాలా దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎండిన పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని పలు పరిశోదనల్లో వెల్లడింది.ఇంకా అంతే కాకుండా వీటిలో చాలానే రకాలు ఉన్నాయి కాబట్టి తినదగినవేవో, తినకూడనివేవో ఖచ్చితంగా తెలుసుకొని తినడం ఆరోగ్యానికి మంచిది. లేదంటే లేని సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: