రోజు ఈ పొడి వాడితే చాలా బలంగా అవుతారు?

frame రోజు ఈ పొడి వాడితే చాలా బలంగా అవుతారు?

Purushottham Vinay
ఇప్పుడు చెప్పే పొడిని వాడడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఈజీగా లభిస్తాయి.అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. రోజంతా కూడా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ పొడిని వాడడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పొడిని వాడడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే ఈ పొడిని వాడడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది.ఇంకా కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం,  జుట్టు ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది.ముఖ్యంగా పిల్లలకు ఈ పొడిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వారిలో ఎముకలు, కండరాలు చాలా ధృడంగా తయారవుతాయి.  ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.



ఈ పొడిని తయారు చేసుకోవడానికి  మనం ఒక కప్పు ఫూల్ మఖనాను, పావు కప్పు బాదంపప్పును, పావు కప్పు వాల్ నట్స్ ను, పావు కప్పు పల్లీలను, పావు కప్పు జీడిపప్పును, మూడు టీ స్పూన్ల సోంపు గింజలను, మూడు స్పూన్ల పుచ్చగింజల పప్పును, ఒక టీ స్పూన్ మిరియాలను ఇంకా రుచికి తగినన్ని ఎండు ఖర్జూరాలను ఉపయోగించాల్సి ఉంటుంది.



ముందుగా మీరు కళాయిలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, వాల్ నట్స్ అలాగే ఫూల్ మఖనా వేసి దోరగా వేయించి గిన్నె లోకి తీసుకోవాలి.ఆ తరువాత అదే కళాయిలో మిరియాలు, ఎండు ఖర్జూరం ముక్కలు, సోంపు గింజలు ఇంకా పుచ్చగింజల పప్పు వేసి వేయించాలి. 
తరువాత వీటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని తీసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకుని గాలి తగలకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఇక ఈ పొడిని ఒకేసారి తయారు చేసుకుని నెలరోజుల పాటు నిల్వ చేసుకోవాలి.అవసరమైతే ఇందులో పటిక బెల్లం పొడిని కూడా మీరు వేసుకోవచ్చు.ఇక ఇలా తయారు చేసుకున్న పొడిని ప్రతి రోజూ ఒక టేబుల్ స్పూన్ మోతాదులో గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకోవాలి. ఇలా ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా ఈజీగా పెరుగుతుంది. ఇంకా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా మన ఇంట్లోనే సులభంగా ఈ పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: