POTATO: వంటకే కాదు.. క్లీనింగ్ కి కూడా సూపర్?

Purushottham Vinay
బంగాళాదుంపలను ఉపయోగించి మనం ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకుంటాం. సాధారణంగా మనలో చాలా మంది కూడా కంటి చూపును మెరుగుపరుచుకోవడానికి , కంటి సమస్యలను తొలగించుకోవడానికి కళ్లద్దాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు.అయితే ఈ కళ్లద్దాలను రోజూ వాడడం వల్ల వాటిపై మరకలు, దుమ్ము ఇంకా ధూళి వంటివి ప్రతి రోజూ పేరుకుపోతూ ఉంటాయి.కాబట్టి వీటిని మనం ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ కళ్లద్దాలను శుభ్రపరుచుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ బంగాళాదుంపలను ఉపయోగించి మనం చిటికెలో కళ్లద్దాలను ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. బంగాళాదుంప స్లైస్ ను తీసుకుని లెన్స్  లోపలి భాగం వైపు బాగా రుద్దాలి.ఇలా రుద్దడం వల్ల మరకలు ఇంకా దుమ్ము తొలగిపోయి లెన్స్ చాలా చక్కగా మెరుస్తుంది.అలాగే ఈ బంగాళాదుంపలను ఉపయోగించి మనం ఇనుప వస్తువులకు పట్టిన తుప్పును కూడా ఈజీగా తొలగించవచ్చు. ఇందుకోసం తుప్పు పట్టిన భాగంలో బేకింగ్ సోడా ఇంకా డిష్ లిక్విడ్ ను వేసుకోవాలి. ఆ తరువాత బంగాళాదుంప ముక్కను తీసుకుని బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల తుప్పు చాలా త్వరగా వదిలిపోతుంది.



ఇంకా అలాగే అనుకోకుండా కొన్నిసార్లు మన కాళ్లల్లో లేదా చేతులల్లో పొరపాటున చిన్న చిన్న గాజు ముక్కలు గుచ్చుకుపోతూ ఉంటాయి. అయితే ఇవి కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. వాటిని అలాగే తీయడానికి వీలులేకుండా ఉంటాయి. అలాంటప్పుడు బంగాళాదుంప ముక్కను ఆ గాజు ముక్కలు గుచ్చుకున్న చోట ఉంచి కొద్దిగా గట్టిగా నొక్కాలి. ఇలా చేయడం వల్ల గాజు ముక్కలు ఈజీగా బయటకు వస్తాయి. ఇంకా అలాగే వెండి వస్తువులను శుభ్రం చేయడంలో కూడా బంగాళాదుంప ముక్క మనకు చాలా సహాయపడుతుంది.ఈ బంగాళాదుంపలను ఉడికించగా వచ్చిన నీటితో వెండి వస్తువులను శుభ్రం చేసుకోవడం వల్ల వెండి వస్తువులు ఈజీగా తళతళ మెరిసిపోతాయి. ఇంకా అలాగే వేడి నీటిలో బంగాళాదుంపలను వేసుకోవాలి. అదే నీటిలో వెండి వస్తువులను వేసి ఒక గంట సేపు అలాగే ఉంచాలి.ఆ తరువాత వెండి వస్తువులను బయటకు తీసి పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల వెండి వస్తువులపై ఉండే మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఇంకా అలాగే బట్టలపై పడే చిన్న చిన్న మరకలను తొలగించడంలో కూడా ఈ బంగాళాదుంపలు సహాయపడతాయి.ఈ బంగాళాదుంపను స్టెయిన్ రిమూవర్ తో కలిపి బట్టలపై రుద్దడం వల్ల బట్టలపై పడిన మరకలు చాలా సులభంగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: