వెంపలి చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే ఈ చెట్లు మనకు ఎక్కడపడితే గుంపులు గుంపులుగా కనిపిస్తాయి.అయితే ఈ చెట్టు ఆరోగ్య పరంగా మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు శాస్త్రీయ నామం టెప్రోసియా పర్ ప్యూరియా అని అంటారు. దీనిని ఇంగ్లీష్ లో వైల్డ్ ఇండిగో అని అంటారు. వెంపలి చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను చాలా అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు.వెంపలి చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నేటి కాలంలో మూత్రపిండాలకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు.అలాంటి వారు వెంపలి చెట్టును వాడడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాడైపోయిన మూత్రపిండాలను కూడా తిరిగి బాగు చేసే అద్భుతమైన గుణం ఈ వెంపలి చెట్లకు ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెంపలి చెట్టు వేర్లను సేకరించి వాటిని నీడలో ఆరబెట్టాలి. ఆ వేర్లు పూర్తిగా ఎండిన తరువాత వాటిని పొడిగా చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.
ఇక మూత్రపిండాలు పాడైపోయిన వారు ఈ చూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని ఒక వారం రోజు పాటు తాగాలి.ఇలా తాగడం వల్ల పాడైపోయిన మూత్రపిండాలు తిరిగి బాగవడంతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఇంకా అలాగే ఈ చెట్టు వేర్లతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు చాలా బలంగా మారతాయి. దంతాల సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే ఈ చెట్టు ఆకులను పొడిగా చేసుకుని ఈ పొడిలో నీటిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ తో కూడా మీరు దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా అలాగే కామెర్ల వ్యాధిని నయం చేయడంలో కూడా వెంపలి చెట్టు మనకు చాలా బాగా సహాయపడుతుంది. ఈ వెంపలి చెట్టు సమూల భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి.
ఆ తరువాత ఈ డికాషన్ ను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కామెర్ల వ్యాధి చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంకా అలాగే ఈ డికాషన్ ను తాగడం వల్ల రక్తం బాగా శుద్ది అవుతుంది.ఇంకా వెంపలి చెట్టు ఆకుల పొడికి సమానంగా పటిక బెల్లాన్ని కలిపి స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల మొలల సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే వెంపలి చెట్టు మొత్తాన్ని 5 గ్రాముల మోతాదులో తీసుకుని నీటిలో వేసి మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని వడకట్టి దానికి పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా మెదడు చురకుగా పని చేస్తుంది.అజీర్తి సమస్యతో బాధపడుతున్నప్పుడు వెంపలి చెట్టు వేరును నీటిలో వేసి మరిగించి కషాయం లాగా చేసుకోని తీసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.