కాసర కాయల గురించి ఎప్పుడైన విన్నారా? ఇవి మనకు గ్రామీణ ప్రాంతాలలో లభిస్తాయి. ఈ కాసర కాయలు సంవత్సరంలో కేవలం మూడు నెలల పాటు మాత్రమే లభిస్తాయి. అది కూడా మనకు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి.ఈ కాసర కాయ తీగలు ఎక్కువగా కాలువ గట్లపై, రోడ్లకు రెండు వైపులా ఇంకా ఇతర చెట్లకు అల్లుకుని పెరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో కాసరకాయలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. ఇక ఈ కాసర కాయలు చూడడానికి చిన్న కాకరకాయల్లా ఉంటాయి. వీటిని రుచి గురించి తెలిస్తే ఈ కాయలను మళ్లీ మళ్లీ కావాలంటారు. ఈ కాయలతో ఎక్కువగా కారాన్ని, కూరను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇంకా ఈ కాసర కాయలతో చేసే కారం చాలా రుచిగా ఉంటుంది.అందుకే వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కాసరకాయల్లో పోషకాలతో పాటు చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ కాయల్లో చాలా పోషకాలు దాగి ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, బీటా కెరోటీన్, ఐరన్, పొటాషియం, జింక్ వంటి చాలా పోషకాలు ఉంటాయి.
ఈ కాసర కాయలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పరిశోధనల ద్వారా తెలిసింది. కాసర కాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా అదుపులో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు చాలా ధృడంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.ఈ కాసరకాయలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.ఇంకా వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉండవచ్చు. వర్షాకాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే రక్తహీనత సమస్యను తగ్గించి శరీరంలో రక్తవృద్దిని కలిగించడంలో కూడా కాసరకాయలు చాలా బాగా సహాయపడతాయి. ఇంకా అలాగే కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచి కాలేయ సమస్యలను తగ్గించడంలో ఈ కాసరకాయలు మనకు బాగా ఉపయోగపడతాయి.