దురద ఎక్కువగా వేధిస్తే ఇలా చెక్ పెట్టండి?

Purushottham Vinay
మనల్ని బాగా వేధించే చర్మ సమస్యల్లో దురద కూడా ఒకటి. పురుగులు, కీటకాలు కుట్టడం వల్ల ఇంకా అలాగే రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ ల వల్ల ఈ దురద సమస్య అనేది తలెత్తుతుంది.దురద వల్ల మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది.ఈ దురద సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిక ముందే దీని నుండి బయటపడడం ఖచ్చితంగా చాలా అవసరం. ఈ దురద సమ్య నుండి బయటపడడానికి మందులను, ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు.అయితే ఎలాంటి మందులు వాడే పని లేకుండా సహజ సిద్దంగా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చులో దరదను తగ్గించుకోవచ్చు. దురద సమస్యతో బాధపడే వారు ఈ టిప్ ని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



ఈ టిప్ తయారు చేసుకోవడానికి గానూ మనం వేపాకును ఇంకా పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. వేపాకులో, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ను తగ్గించి దురదను తగ్గించడంలో చాలా అద్భుతంగా పని చేస్తాయి.ఇందుకోసం ముందుగా వేపాకును శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఇందులో కొద్దిగా పసుపుని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దురద ఉన్న చోట చర్మంపై అలాగే రాయాలి.తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత వేడి నీటితో శుభ్రంగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్య ఈజీగా తగ్గుతుంది. ఇంకా వేపాకు పేస్ట్ నుండి రసాన్ని తీసి కూడా మనం చర్మంపై రాసుకోవచ్చు. ఈ విధంగా వేపాకును ఇంకా పసుపును కలిపి వాడడం వల్ల మనం చాలా ఈజీగా దురద సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: