ప్రస్తుత కాలంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే కళ్లద్దాలు పెట్టుకుంటున్నారు. ఇక కంటి సంరక్షణలో చిన్న లోపం కూడా చాలా భారంగా మారుతుంది.
ఈ రోజుల్లో పిల్లలు లేదా పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తమ ఫోన్‌లు ఇంకా ల్యాప్‌టాప్‌లలో చాలా ఎక్కువ సమయం గడుపుతున్నారు. అలాంటి సందర్భాల్లో కంటి నొప్పితో తరచుగా పెద్ద సమస్య ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా వాడటం వల్ల కళ్లు బలహీనపడతాయి. వీటికి సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లు బలహీనపడతాయి. మీరు మొబైల్స్ లేదా ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం వల్ల కంటి నొప్పిని ఎదుర్కొంటుంటే దాని నుంచి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బంగాళదుంపలు కంటి నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇందుకోసం మీరు ముందుగా బంగాళదుంప ముక్కలను కట్ చేసి ఒక 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.
దీని తరువాత, చల్లని ముక్కలను కళ్ళపై ఉంచితే నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అలాగే రోజ్ వాటర్ కళ్లకు కూడా మేలు చేస్తుంది. కంటి నొప్పి, చికాకు నుంచి బయటపడటానికి రోజ్ వాటర్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. కళ్లల్లో 2 నుంచి 3 చుక్కల రోజ్ వాటర్ వేసి కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లలో దురద సమస్యని ఈజీగా అరికట్టవచ్చు.అలాగే మీరు మొబైల్ పరికరాలతో పాటు ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ కళ్లలో నొప్పి రావడం వస్తే కీరదోసకాయ మీకు ఈ నొప్పి నుంచి తక్షణ ఉపశమనంని కలిగిస్తుంది. కంటి నొప్పిని వదిలించుకోవడానికి మీరు దోసకాయ ముక్కలను కట్ చేసి ఒక 20 నిమిషాల పాటు కళ్లపై ఉంచవచ్చు. ఇంకా ఇది కాకుండా మీరు కీర దోసకాయ తురుము కింద చేసి కూడా మీ కళ్లక ప్యాక్ కింద పెట్టుకోవచ్చు. కీర దోసకాయ వల్ల కంటి నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు.