లంగ్స్ ప్రాబ్లమ్స్ కి ఈజీగా చెక్ పెట్టె టిప్?
ప్రస్తుత కాలంలో చాలా మంది కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్, ఆస్థమా, న్యుమోనియా, దగ్గు ఇంకా బ్రాంకైటిస్ వంటి వివిధ రకాల సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. అయితే వీటి వల్ల మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అలాగే ఈ సమస్యలకు మందులు వాడడం వల్ల మనం చాలా దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.అయితే ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు సహజ సిద్దంగా లభించే వామాకును వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వామాకులో థైమాల్, కార్వకాన్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువగా తయారవ్వడానికి కారణమయ్యే హిస్టమిన్స్ ఉత్పత్తిని తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
ఇంకా అంతేకాకుండా వామాకును వాడడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ల కారణంగా తలెత్తే ఇబ్బంది, చికాకు కూడా తగ్గుతుంది. ఆస్థమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలతో బాధపడే వారు వామాకును వాడడం వల్ల ఆ సమస్య నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు.ఈ ఆస్థమా సమస్యతో బాధపడే వారి ఇండ్లల్లో ఈ వామాకు మొక్క తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారు ఈ వామాకును పచ్చడిగా చేసి కూడా తీసుకోవచ్చు.ఇంకా అలాగే నీటిలో వామాకును వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. అలాగే వంటల్లో కూడా వామాకును వాడుకుకోవచ్చు. ఏదో ఒక రూపంలో ప్రతి రోజూ గుప్పెడు వామాకును ఆహారంగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఈజీగా తగ్గు ముఖం పట్టడంతో పాటు మన దరి చేరకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకుని వాడండి. అనేక రకాల లంగ్స్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టండి.