మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే ఆహారాలలో
రెడ్ రైస్ కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఆ రైస్‌కు
రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇక ఆంథోసయనిన్స్ సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ల లాగా పనిచేస్తాయి.అందువల్ల
రెడ్ రైస్‌ను తింటే మనం చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు.
రెడ్ రైస్ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ
రెడ్ రైస్‌లో మన శరీరానికి కావల్సిన పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, బి విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. నియాసిన్, థయామిన్,
విటమిన్ బి6లతోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా
రెడ్ రైస్‌లో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల
రెడ్ రైస్‌ను తింటే ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. ఎందుకంటే
రెడ్ రైస్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా మెరుగు పరుస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను కూడా బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది.
అందువల్ల
షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి.అలాగే దీని వల్ల
డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే
గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.ఈ
రెడ్ రైస్‌లో ఉండే ఆంథోసయనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి.అందువల్ల కణజాలం రక్షించబడుతుంది. అలాగే
గుండె జబ్బులు, క్యాన్సర్లు, నాడీ సంబంధ జబ్బులు రాకుండా ఉంటాయి.
రెడ్ రైస్‌ను ప్రతి రోజూ తినడం వల్ల
కొలెస్ట్రాల్ లెవల్స్ ఈజీగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. ఈ
రెడ్ రైస్‌లో మోనాకోలిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి
కొలెస్ట్రాల్ లెవల్స్‌ను ఈజీగా తగ్గిస్తాయి. దీని వల్ల
హార్ట్ ఎటాక్ అనేది రాకుండా చూసుకోవచ్చు. అలాగే
రెడ్ రైస్‌లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఈ రైస్‌ను తింటే
షుగర్ లెవల్స్ కూడా వెంటనే పెరగవు. రక్తంలో చక్కెర అనేది నెమ్మదిగా కలుస్తుంది. ఇది
డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేసే విషయం. అందువల్ల ఈ రైస్‌ను తింటే
షుగర్ లెవల్స్‌ను ఈజీగా నియంత్రణలో ఉంచుకోవచ్చు.